-
-
మూలికా వైద్యంతో ఆరోగ్యం
Mulika Vaidaymto Arogyam
Author: Dr. G. Lakshmana Rao
Publisher: Hyderabad Book Trust
Pages: 244Language: Telugu
మూలికా వైద్యంలో అతి సామాన్యమైన రుగ్మతలను, అల్లోపతి వైద్యానికి లొంగని దీర్ఘకాలిక రుగ్మతలను కూడా సత్వరంగా, సంపూర్ణంగా నివారించగలిగిన ఔషధాలు ఉన్నాయి. ఉబ్బసం (ఆస్తమా), వివిధ రకాలైన తలపోట్లు, పార్శ్వపు నొప్పి, కడుపులో మంట, చర్మవ్యాధులు, నడుంనొప్పి, బహిష్టు సమస్యలు, కీళ్ళవాపులు, మూత్రపిండాల్లో రాళ్ళు తదితర సమస్యలకు మూలికా వైద్యం చక్కటి పరిష్కారాన్ని అందించుతోంది.
మూలికా వైద్యం చాలా నెమ్మదిగా పనిచేస్తుందని, సత్వర రోగ నివారణ అందించలేదని గట్టి నమ్మకం ప్రజల్లో కన్పిస్తుంది. ఈ నమ్మకం కేవలం అపోహ తప్ప వాస్తవం కాదు. మూలికావైద్యం అత్యధిక సందర్భాల్లో సత్వరంగాను, సంపూర్ణంగాను రోగనివారణ చేస్తుంది. పైగా మూలికా వైద్యం వలన ఎలాంటి దుష్ఫలితాలు కలిగే అవకాశం లేదు. భారతదేశంవంటి విభిన్న వాతావరణ పరిస్థితులలో ప్రకృతి సిద్ధంగా పెరిగే మూలికలకు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.
- డా. జి. లక్ష్మణ రావు
* * *
ఎటువంటి కృత్రిమ రసాయనిక ఔషధాలు, వాటికి సంబంధించిన దుష్ఫలితాల బెడద లేకుండా.. కేవలం ప్రకృతి సహజమైన మూలికలతోనే సకల వ్యాధులను పూర్తిగా, శాశ్వతంగా నయం చేయడం ఈ మూలిక వైద్యం ప్రత్యేకత. ఇందులో ఔషధాలుగా ప్రస్తావించిన ప్రతి వస్తువూ ప్రపంచంలో ఏదో ఒక సమూహం ఆహారంగా తీసుకుంటున్నదే కావటం విశేషం.
