-
-
ముహూర్త చింతామణి
Muhurtha Chintamani
Author: M. Viswanatha Raju
Publisher: Sri Sai Vastu Publications
Pages: 184Language: Telugu
ముహూర్త చింతామణి
మూలం: శ్రీరామ దైవజ్ఞ
తెలుగు: డా. ముదుండి విశ్వనాథరాజు
వేదవిహితకార్యములను నిర్వహించుటలో కాలమత్యంత మహత్వపూర్ణమైనది. షోడశ సంస్కారముల నిర్వహణలో కాలమధిక ప్రాధాన్యత వహించుచున్నది. మానవ జీవనములో పుట్టుక నుండి మరణము వరకు కలుగు వివిధ సమస్యలకు అనుకూల ప్రతికూల సమయములను తెలుసుకొని ప్రతికూల స్థితి నుండి అనుకూల స్థితికి రావడానికి తగిన కాలమే అనుకూల సమయముగా అభ్యుదయ ముహూర్తముగా నిర్ణయించవచ్చు. జ్యోతిర్విద్యాజ్ఞానము ద్వారా తిథి, వార, నక్షత్ర, కరణ, యోగముల నాధారము చేసుకొని అనుకూల సమయమును నిర్ణయించుటను ముహూర్తమని స్థూలముగా చెప్పవచ్చును.
శ్రీరామ దైవజ్ఞుడు రచించిన ముహూర్త చింతామణి గ్రంథము ముహూర్త బోధక గ్రంథములలో అత్యంత ప్రామాణికమై లోకములో ప్రసిద్ధి పొందినది. ఈ గ్రంథమింతకు పూర్వము తెలుగులో సంపూర్ణముగా ననువదింపబడలేదు. జ్యోతిష శాస్త్రాభిలాషులకు, ముహూర్త విషయజ్ఞానము నాశించు విద్యార్థుల కుపయోగపడునను తలంపుతో నీగ్రంథమును తెలుగులోకి అనువదించుట జరిగింది.
శాస్త్రాభిలాషులైన తెలుగు పాఠకులు, జ్యోతిష విద్యార్థులు ఈ గ్రంథమును చదివి శాస్త్రజ్ఞానమును పొందగలరని యాశించుచున్నాను. ఈ గ్రంథాయధ్యయనము వలన ఏ కొంత ప్రయోజనము పొందినను నాకృషి సఫలమైనదని తలంతును.
- భవదీయుడు
డా. ఎం. విశ్వనాథరాజు
