-
-
ముహూర్తము
Muhurtamu
Author: B.V.Raman
Publisher: Mohan Publications
Pages: 136Language: Telugu
ఈ రచన యొక్క ఉద్దేశము అనునిత్యం మానవ జీవితంలో అడుగడుగున ఎదురయ్యే అనేక సంఘటనలకు సంబంధించిన ముహూర్త విషయమై చెప్పబడిన అనేక ముఖ్యసూత్రములను పాఠకులకు అందించడమే. ముహూర్తము విషయమై సంస్కృతములో విశేషమైన సమాచారము లభిస్తోంది. ప్రామాణిక గ్రంథములలో చెప్పబడిన ముఖ్యమైన విషయములను నా గ్రంథములో చేర్చడం జరిగింది. ప్రధాన గ్రంథములలో చెప్పబడిన విషయములోని అభిప్రాయభేదములతోపాటు, గత 35 సంవత్సరముల నా విశేషమైన అనుభవములో మానవ వ్యవహారములకు సంబంధించి కొన్ని వందల ముహూర్తములందు గ్రహించిన అనేక విశేషములను ఇందు చేర్చడం జరిగింది.
తెలియకుండా ఏర్పడే శంకలను భయములను తొలగించి చక్కగా వ్యవహారములు నిర్వర్తించడమే జ్యోతిశ్శాస్త్రోద్దేశము. ముహూర్తము దీనికి సహకరిస్తుంది. ఇది పూర్తి గ్రంథము అని నేను చెప్పలేను. అనంతమైనది ముహూర్త శాస్త్రము. అనేక ప్రయాసలతో నేను సేకరించిన విషయములను ఇందు చేర్చడం జరిగింది. ఈనాటి వారు లాంఛనంగా చేసే జ్యోతిశ్శాస్త్ర సంప్రదింపుల వల్ల ఉపయోగము కంటే, ప్రకృతి సూత్రములకు అనుగుణంగా ఏవిధంగానుమోసపోకుండా ముహూర్తము ప్రయోజనం కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను.
- బి.వి. రామన్

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE