-
-
ముగింపు
Mugimpu
Author: P. S. Narayana
Publisher: Navajyothy Publications
Pages: 120Language: Telugu
తనకింకెవరూ అక్కరలేదు. అన్నీ తన మంజులే. కాలమంతా మంజుల ముందే హాయిగా గడపవచ్చు. మంజులతో తను స్వర్గసుఖాలు అనుభవించవచ్చు.
అంత ఆలస్యంగా పడుకున్నా తెల్లవారుజామున ఐదు గంటలకే మెళకువ వచ్చింది. లేచి ముఖం కడుక్కొని యిస్త్రీ గుడ్డలు కట్టుకుని వరండాలో గేటువంకే చూస్తూ కూర్చున్నాడు చల్లగాలి అయినా ఓపికగా.
తూర్పున సూర్యుడుదయించాడు. తిరిగి ఆ శానిటోరియం జీవించిందనేలా ఒక్కొక్కరే లేచి తమ కాలకృత్యాలు తీర్చుకోసాగారు.
శేఖరం ఆత్రంగా ఆ గేటునూ, ఆ గేటులోనుండి బయటకు వెళ్ళే రోడ్డునూ చూస్తూ కూర్చున్నాడు. అతడిలో కాలం గడుస్తున్నకొద్దీ ఆతురత హెచ్చుతోంది.
ఇంతలోనే మంజుల వచ్చింది. సరిగ్గా తను కోరిన ప్రకారం ఒక 'డే ఆఫ్' రోజు సాయింత్రం ఎంత అందంగా అలంకరించుకొని వచ్చిందో అలాగే వచ్చింది.
ఆమెను చూస్తూనే లేచి నిలబడ్డాడు నవ్వుతూ శేఖరం.
"మంజూ! ఇంత ఆలస్యంగా వచ్చావేం?"
"ఏవంత ఆలస్యమయింది.... ఫరవాలేదు!" అంది.
