• Mudu Palilu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మూడు పాళీలు

    Mudu Palilu

    Author:

    Publisher: Palapitta Books

    Pages: 84
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ వి.ఆర్‌.గణపతి రూపొందించిన 'మూడు పాళీలు' గ్రంథంలో మూడు కవితా ప్రక్రియలున్నాయి. 1. పద్యం 2. గేయం 3. వచన కవిత. త్రిముఖంగా సాగిన శ్రీ గణపతి లేఖినిలో నుంచి పరిణత కవితను ఆవిష్కరించిన కృతులెన్నో వున్నాయి.

ఉదాహరిస్తే ఈ సంపుటిలోని అత్యధిక కవితలు అగ్రగాములుగా వస్తాయి. నేను కొన్ని కవితల్లోని పంక్తులు ఉదాహరించి చూపుతాను.
శ్రీ గణపతి పద్యరచనా పటిమకు ఒక ఉదాహరణ -
''పారెడు గోదావరి, మా
నేరుల పీయూష తుల్య నీరము భువికిన్‌
పైరుల, పంటల సిరులిడ
'గౌరమ్మ'కు రూపమన్న కరినగరమ్మే''.
కరీంనగరం వైభవాన్ని ధారా రమ్యంగా అభివర్ణించిన పద్యమిది.

శ్రీ గణపతి 'వెన్నెముక' శీర్షికతో గేయ చ్ఛందస్సులో నాలుగు పంక్తుల్లో రైతు దయనీయ స్థితిని ఇట్లా వర్ణించినాడు -
''అన్నా! ఈ నీ దేశం
ఎన్నటికీ నీది కాదు
మన్ను మాత్రమే నీది
అన్నం వేరొక్కరిది''.
ఈ నాలుగు పంక్తుల్లో రైతు పండించిన పంటను కాజేసే దుష్టశక్తులను ధ్వనింపజేసినాడు.

శ్రీ గణపతి వచన కవితా ప్రక్రియలో రచించిన కవితల్లో అగ్రశ్రేణికి చెందింది 'కవిత్వమంటే' అనే కవిత. అందులోని గణనీయ పంక్తులివి.
''కళ్లు మూసుకుని చేసే ధ్యానం కాదు కవిత్వం
మూసుకున్న కళ్లను తెరిపించటం కవిత్వం''

శ్రీ గణపతి తానే స్వయంగా అన్నట్టుగా ఈ కవితా సంపుటిలోని అనేక పంక్తులు సగటు పాఠకుల హృదయ నయనాలను వికసింపజేస్తాయని నా విశ్వాసం.

- డా. సి.నారాయణరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Mudu Palilu