-
-
మూడు ముక్కలాట
Mudu Mukkalata
Author: Chalapaka Prakash
Publisher: Ramyabharathi
Pages: 56Language: Telugu
తాత్కాలిక ప్రయోజనాలు, ప్రాంతీయవాదాలు పెరుగుతున్నాయి. కాని శాశ్వతమైన అభివృద్ధి మార్గాలు మరచిపోతున్నారని, మనుషులంతా ఒక్కటేననే స్పృహతో రాసిన దీర్ఘకవిత ఇది. ''ఇప్పుడు మనం ఆడేది మూడు ముక్కలాటే, ఇప్పుడు మనం చూసేది మూడు నక్కలాటే'' అంటూ వర్తమాన రాజకీయ చిత్రాన్ని ముందుపెట్టి కవిత్వం ప్రారంభించారు.
''ఏ చోటు నీది కాదు, నాది కాదు, మనది కాదు, ఆక్రమించుకున్నది వాడు, ఆడుకుంటున్నది వాడు'' అంటూ భూమి కొందరికే సొంతమౌతున్న దౌర్భాగ్యస్థితి చెప్పారు. ''వాగ్దానాల వానలో ముంచేస్తున్నది వాడు, ఒడ్డున చక్కగా పంచేసుకునేదీ వాడు'' అంటూ ప్రజల్ని ఆలోచింప చేస్తున్నారు. భో(జ)నాల పండగను రాజకీయం వాడుకుంటున్నదని, యాసభాషల వంటలని బాగా భోంచేస్తుందని, సాధువుని సైతం కసాయివాడిగా మార్చేస్తోందని ఆవేదన చెందుతున్నారు కవి. పెద్ద ముక్కు శిఖరంగా చూపి ప్రజల్ని మభ్యపెడుతుందని హెచ్చరిస్తున్నారు. తొడగొట్టి, రెచ్చగొట్టి రక్తానంతా పీల్చేసే రాజకీయాన్ని ఎండకడుతున్నారు. అతి తెలివి తేటలతో భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టబోతున్న వాళ్ళ గురించి బాధ్యతగల కవిగా ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఓటుతో 'కోట్లు' తోడుకుంటున్న వాడిని నిలదీయ వలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఇంటిని ఒంటిని వదిలేసి ఆత్మతో ఎగిరెళ్ళిపోయేలా 'కబ్జా' లోకం రాజ్యం ఏలుతోందని వాస్తవం చెపుతున్నారు. ఒక ఆవేశంతో ఒక ఆవేదనతో ఈ దీర్ఘకవిత రాశారు చలపాక ప్రకాష్.
దేశంలో ఇన్ని అన్యాయాలు, ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నా ప్రజలు పట్టించుకోవటం లేదనే ఆవేదన కవిని ఈ కావ్యం రాయించింది. కవులు కూడా చూస్తూ వూరుకుంటే ఇక దేశాన్ని బాగుచేసేవాడే లేనట్లే. మంచి రాజకీయాల్ని గుర్తించి గద్దెనెక్కించే చైతన్యం ప్రజల్లో ఇంకా ఇంకా పెరిగితేనే రాష్ట్రానికి స్వర్గం, అందాక తప్పదు మనకీ నరకం అనే సందేశంతో సమకాలీన రాజకీయ స్పృహతో బాధ్యతగల కవిగా మంచి దీర్ఘకవితను అందించిన ప్రకాష్‌కు శుభాభినందనలు.
- డా. రావి రంగారావు

- ₹60
- ₹36
- ₹60
- ₹36
- ₹10.8
- ₹60