-
-
మూడో కన్ను
Mudo Kannu
Author: Chalapaka Prakash
Pages: 200Language: Telugu
Description
మూడో కన్ను
మాట్లాడకపోతే
మాటలు రాని మూగవాడ్ని కాను
మౌనముద్రలో
మత్తుగా నిద్రిస్తున్న తాగుబోతునీ కాను
కళ్లు మూసుకున్నా
తెరవని మూడో కంటితో
నిశ్శబ్ద నైరాశ్యాలతో చెలగాటమాడుతూ
లోకం తీరును గమనిస్తున్న త్రినేత్ర సంచారిని !
కంటికి కనిపించని దృశ్యాల్ని
వింటికి కనిపించని శబ్దాల్ని
పంటికి తగలని ఆకలి దాహాల్ని
నిశ్శబ్ద రసంగా రుచి చూసి
అక్షర రూపంగా వండి వడ్డిస్తున్న కలంకారుడిని !
తడిచిన చెమట చుక్కల్ని లైనులో నుంచోబెట్టి
మడిచిన నోట్లని కూడగట్టి
చివరికి ఏడ్చిన నోట్లకట్టల్ని తగలబెట్టడం చేస్తుంటే
మూడోకన్ను తెరవక ఆపడం ఎవరి తరం?
విజయమొక్కటే విజయకేతనంగా
ఎగిరి, వెలిగిపోదు
అపజయమెపుడూ కిందే ఉండిపోదు
పడిలేచే కెరటంలాగ
శక్తియుక్తులన్నీ మారుతున్నప్పుడు
నేనో మూడోకన్ను తెరుస్తాను
నరం నరం మౌన శబ్దాన్ని భగ్నపరిచి
కొత్త రక్తమై చిమ్మడానికి
నవచైతన్య కెరటమై నేనొస్తాను
ఎగిరెగిరి పడుతున్నవాడి మాడు పగలగొట్టి
మట్టుబెట్టే ఆయుధమై చెలరేగుతాను !
Preview download free pdf of this Telugu book is available at Mudo Kannu
Login to add a comment
Subscribe to latest comments
