-
-
మూడో కన్నీటి చుక్క
Mudo Kanneeti Chukka
Author: Bolloju Baba
Publisher: Self Published on Kinige
Pages: 119Language: Telugu
"Narrative poetry మనకేమీ కొత్త కాదు. అయితే, అత్యాధునిక సందర్భంలో ఈ విధమైన నిర్మాణం వెంట ముఖ్యంగా రెండు ప్రయోజనాలున్నాయి. వొకటి: సంప్రదాయ కవిత్వ శైలిని నిరాకరించడం, రెండు- కవిత్వంలో వొదగని సాంస్కృతిక లక్షణాలను స్వీకరించడం. ఈ రెండు పనులూ చక్కగా చక్కదిద్దుతున్నాడు బాబా.
ముఖ్యంగా- ఈ కొత్త కవిత్వ సంపుటిలో బాబా Narrative poetry కి సంబంధించిన అనేక కోణాలని మనకి పరిచయం చేస్తున్నాడు. బహుశా, ఈ సంపుటి ప్రధానంగా తలపెట్టిన task అదే! పైన చెప్పిన కవితలో ఇతర అంశాలు అనేకం వున్నా, అందులోని narration మనల్ని కట్టిపడేస్తుంది."
- అఫ్సర్
"పర్సనల్ అనుభవాల ద్వారా పబ్లిక్ వాస్తవాన్ని రూపుకట్టటం బొల్లోజు బాబా కవిత్వ విధానం. బయట పెట్టటాన్ని మించి దాచి పెట్టటంలోనే ఇతని కవితా కళ విశిష్టత ఉంది. He hides more than he reveals. అనార్బాటమైన వచనంతో ఆకర్షణీయమైన కవిత్వ గూడు అల్లడంలో ఈ కవి నిష్ణాతుడు. మానవ వ్యవహారాల్ని మ్యాజికల్ రియలిజం ద్వారా ప్రవేశపెట్టి మెప్పించగలగడంలో దిట్ట."
- జి. లక్ష్మినరసయ్య
