-
-
ముద్దు వడ్డన్లు 2
Muddu Vaddanlu 2
Author: Dr. Velchala Kondal Rao
Publisher: Viswanatha Sahitya Peetham
Pages: 59Language: Telugu
ఒక పాతికేళ్ళ క్రింద విశాఖపట్టణంలో శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి అధ్యక్ష్యత క్రింద నేనేదో ఉపన్యాసం చేశాను. అందులో కొన్ని ఖగోళ విషయాలు, కొన్ని వేదాంత విషయాలు, కొన్ని భూగర్భశాస్త్ర విషయాలు చెప్పుతూ ప్రధానంగా తత్త్వశాస్త్రాన్ని గురించి మాట్లాడినట్లున్నాను. నాకు సరిగా జ్ఞాపకం లేదు. ఉపన్యాసమంతా తెలుగులోనే జరిగింది.
గంటన్నర మాట్లాడడమైనది. సభలోనుంచి చివరకు ఒక ప్రసిద్ధుడు, వృద్ధుడు అయిన న్యాయవాదిగారు లేచి నా వద్దకు తెలుగులో ఇన్ని భావాలు ఇట్లా చెప్పడానికి వీలుందా?అని ప్రశ్నపూర్వకంగా నన్ను ప్రశంసించారు. ఈ సందేహం ఆధునికులైన విద్యావేత్తలనందరను బాధిస్తుంది. నేను చాలసార్లు ఎందుకు వారిట్లా సందేహపడతారు అనుకున్నాను. విచారించాను. నాకు ఒక్కటే సమాధానం తోచింది. వాళ్ళు ఇంగ్లీషులోనే ఊహిస్తారు. ఇంగ్లీషునే వ్రాస్తారు. వాళ్ళకు ఇంగ్ళీషు తప్ప తెలుగురాదు. అంటే వాళ్ళ బుద్ధులు ఇంగ్లీషులో వికసించినవి. తెలుగులో వికసించలేదు. వికసించిన ఏ పువ్వైనా దాని వాసన దానికి వుంటుంది. గాలి ఆ ఆ పరిమళాన్నే ప్రవహింప చేస్తుంది. నేను ఇంగ్లీషులో కొన్ని పువ్వుల మీద గాలిని తీసుకువెళ్ళడమే ఎరుగుదును. తెలుగుదేశంలో పూలమీద గాలి ఎలా మ్రోయవలెనో నాకు తెలియదు అని గాలి అనదు. ఏ పరిమళాన్నైనా అది ప్రవహింపచేయగలదు.
* * *
ఆంగ్లేయులకు మన సంప్రదాయాలు సరిగా తెలియవుకదా, పాపం! ఒకతను శ్రావణ శుక్రవారం సెలవిమ్మన్నాడు. ఫ్రైడే, సన్డే అంటే తప్ప శుక్రవారం, ఆదివారం అంటే తెలియవుగా? అందునా శ్రావణ శుక్రవారం అంటే ఏమిటో దొరగారికి అసలే అర్థం కాలేదు. అతను ఎంతో సిన్సియర్‌గా శ్రావణ శుక్రవారానికి సెలవు నిరుడిచ్చామా అని సహాయకుని అడిగాడు. ఆ సహాయకుడు పక్కా భారతీయుడే అయివుంటాడు. ఈ భారతీయుడు ఎంతో నిబ్బరంగా "శ్రావణ శుక్రవారం నిరుడు ఆదివారంనాడు వచ్చింది" అని చెప్పాడట.

- ₹60
- ₹288
- ₹432
- ₹144
- ₹240
- ₹60