• Mrutyu Keratam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మృత్యు కెరటం

    Mrutyu Keratam

    Author:

    Publisher: Sagar Publications

    Pages: 69
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాంపౌండ్ వాల్ ప్రక్క క్రీనీడలోంచి ఒక ఆకారం కారువైపు వచ్చింది. చేతిలోని పిస్టల్ చమన్ లాల్‌కి గురిపెట్టి చెప్పింది కటువుగా.

“ఎవరూ కదలొద్దు. నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తాను... చమన్ లాల్! ఆ బ్యాగ్ ఇటు ఇవ్వు...”

భయంతో ఒడిలోని తోలుసంచీని మరింత గట్టిగా పట్టుకుంది చమన్ లాల్ చెయ్యి.

గేటు దగ్గరికి వెళుతున్న డ్రైవర్ ఆ మాటలకి వెనక్కి తిరిగాడు. ఒక్క క్షణం ఏం చెయ్యాలో అతనికి తోచలేదు.

“బ్యాగ్ ఇవ్వు...” మరోమారు ఖంగుమంది గొంతు. ఆలోచించే వ్యవధి లేకపోయింది చమన్ లాల్‌కి. జీవితంలో అతనికి అటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు. నెమ్మదిగా బ్యాగ్ అందించాడు రాక్షసుని మాదిరి పిస్టల్ పట్టుకున్న వ్యక్తిని చూసి.

అతను బ్యాగ్ అందుకుని డోర్ విసురుగా మూశాడు. చురుగ్గా వెనక్కి తిరుగుతూ పిస్టల్ పట్టుకున్న చెయ్యి బలంగా విసిరాడు. చప్పుడు చెయ్యకుండా మీదకి దూకిన డ్రైవర్ పొట్టలో తగిలి ఎగిరిపడ్డాడు.

అతను చీకటిలోకి పరిగెత్తాడు.

కారులోంచి అందరూ కంగారుగా దిగారు. చమన్ లాల్ కొడుకులు చీకట్లోకి గుడ్డిగా పరిగెత్తారు. రెండు నిమిషాల తరువాత వినిపించింది మోటార్ సైకిల్ స్టార్ట్ అయిన శబ్దం.

అయినా వాళ్ళు వెదుకుతూనే వున్నారు.

ఆరోజు రాత్రి అన్నం తినలేదు చమన్ లాల్. బ్యాగ్‌లో వుంచిన కాగితం గురించి పెట్టిన క్షణంలోనే మర్చిపోయ్యాడు. బ్యాగ్ తెరిచి చూస్తే తప్ప అది గుర్తురాదు.

ఆ బ్యాగ్‌లో ఒక ప్రముఖ వ్యక్తి ప్రాణాలు దాగి వున్నాయని ఎవరు మాత్రం ఊహించగలరు.

Preview download free pdf of this Telugu book is available at Mrutyu Keratam