-
-
మృత్యుంజయుడు
Mruthyunjayudu
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 272Language: Telugu
అదే సమయంలో ఓ మానవాకారం వేరు శనగపంట వైపు నడుచుకుంటూ వచ్చింది. ఆ ఆకారాన్ని చూసి కెవ్వున కేక పెట్టారు కూలీలు. కారణం... ఆ ఆకారం చనిపోయిన జాంబీది. తాము చూస్తున్నది కలో, నిజమో అర్థం కానంతటి అయోమయంలో కెవ్వు కెవ్వున కేకలు పెడుతూ దూరంగా పారిపోయారు కూలీలు.
అదెలా సాధ్యం? నిన్న రాత్రి చనిపోయి, అందరి ముందు శ్మశానంలో పూడ్చిపెట్టిన జాంబీ బతికిన మనిషిలా ఎలా నడుచుకుంటూ రాగలడు? ఆ దృశ్యం ఊహాతీతంగా వుంది. గుండె జబ్బు లేనివారికి కూడా ఆ క్షణం జాంబీని చూస్తే గుండాగిపోవాల్సిందే.
జాంబీని చూసి ఆశ్చర్యంతో, ఆనందంతో అతని దగ్గరకెళ్ళింది అతని భార్య. ఆమె భారత స్త్రీ కదా! భర్తను ప్రాణంలా పూజించే సంప్రదాయమే కదా భారతీయత.
విపరీతమైన ఆశ్చర్యంతో, భయంతో దూరం నుంచి చూస్తున్నారు కూలీలు. వారు చూస్తుండగానే... విపరీతమైన సంతోషంతో ఊగిపోతూ తన దగ్గరకొచ్చిన ఆమెను చటుక్కున దగ్గరకు లాక్కున్నాడు జాంబీ.
తనను కౌగిలిలోకి తీసుకుంటున్నాడని భ్రమించిన ఆ అభాగ్యురాలు ఆనందంగా అతని కౌగిలిలోకి చేరబోయింది. కానీ జాంబీ కసుక్కున ఆమె గొంతు కొరికాడు. కెవ్వున అరిచిందామె. జరగుతున్నదేమిటో ఆమెకు అర్థంకాక పిచ్చిగా చూస్తుండగానే ఆమె గొంతు నుండి స్రవిస్తున్న రక్తాన్ని అతను నవ్వుతూ చూస్తుండిపోయాడు.
బిత్తరపోయి భయవిహ్వలులై కెవ్వుకెవ్వున అరిచారు కూలీలు. ధైర్యం వున్న ఇద్దరు మగాళ్ళు భయంకరంగా అరుస్తూ జాంబీ మీదకు పరుగెత్తుకెళ్ళారు. అదే వారు చేసిన తప్పు. పిశాచిలాగా వారి మీద తిరగబడ్డాడు జాంబీ. పులిపంజాలా చేతులు విసిరాడు. అతని చేతులకు అంత బలం ఎలా వచ్చిందో తెలియదు.
ఇద్దరి గ్రామీణుల శరీరాలు కత్తి పట్టి చీరినట్లు చీరేయబడ్డాయి అతని చేతులు తగిలి. ఆర్తనాదాలు చేస్తూ నేలకు ఒరిగిపోయారు వాళ్ళు. అది చూడగానే కూలీలందరూ మిన్ను విరిగి మీదపడేట్లుగా అరుస్తూ జాంబీ మీదకు దూకారు. దాంతో జాంబీ పారిపోయాడు. రేచు కుక్కల్లా అతన్ని తరిమారు జనం. కానీ పొలాలకు అవతల వున్న చెట్లలో కలిసి మాయమైపోయాడు జాంబీ.
మీరు రాసిన బుక్స్ లో అత్యంత బోరింగ్ నవల.. ఇదే అనుకుంటాను
Not upto the reputation of the author
I want this book. 9293110119. I'm ready to buy it...