-
-
మృదంగం - కొండేపూడి నిర్మల కాలమ్స్
Mrudangam Kondepudi Nirmala Colomns
Author: Kondepudi Nirmala
Pages: 156Language: Telugu
సీరియస్ రైటర్స్ తో పోలిస్తే తెలుగులో సెటైర్ రైటర్స్ బాగా తక్కువ. స్త్రీలలో ఇంకా తక్కువ. నిర్మల కవిత్వంలో, కధల్లో ఎంత గాఢత వుందో కాలమ్స్ లో అంత హాస్యమూ , వ్యంగ్యమూ కనిపిస్తాయి. ఆమె రాసిన ఒక్కో కాలమ్ ఒక్కో సోషియో పోలిటికల్ సెటైర్ లాంటిది. ఆ గాఢతకీ ఈ హాస్య,వ్యంగాలకీ కారణాలు వేర్వేరు కాదు. ఒక్కటే ఆ౦టే ఆశ్చర్యపోతారేమో.
మృదంగం చదవండి . అందులో వున్న సంఘటనలు, సందర్భాలు కెరటాలు మోసుకుపోయే పూలపడవలా ఆహ్లాదంగా ఏమీ వుండవు. సుడిగుండాల్ని మీటుతూ నడిచే కత్తి పడవలా వు౦టాయి.
కాలరు పట్టుకుని అడిగినట్టు కనిపించే కొన్నిప్రశ్నల గురించి మీరు చదువుతున్నంతసేపూ ఆలోచిస్తారు. ఆలోచిస్తూ ఔననుకుంటారు. కాదనుకుని కోపం తెచ్చుకుంటారు. కయ్యానికి దిగుతారు. ఈ కాలమ్స్ ధారావాహికంగా వస్తున్న రోజుల్లో ఇవే జరిగాయి . ఇలా చదివి అలా మర్చిపోవడం మాత్రం కుదరదు. . నిర్మల రచనల లక్ష్యం అది కానే కాదు.
