-
-
మొసలి కోరిన కోతి గుండె
Mosali Korina Koti Gunde
Author: Nandula Venkateswara Rao
Publisher: Nandula Venkateswara Rao
Pages: 124Language: Telugu
"ఇవన్నీ మరిచిపో, శేఖరం. అనవసరంగా నిన్ను విసిగించాను. ఎన్ని వచ్చినా అన్నిటికీ వాడే ఉన్నాడు. అదే నా ధైర్యం. నన్ను వాడు అన్యాయం చెయ్యడు. భగవంతుడి నిజాయితీ చాలా గొప్పది."
"భగవంతుడేమి చెయ్యగలడు, మాస్టారు? మీరు ప్రతీది గుడ్డిగా భగవంతుడి మీద పెట్టెయ్యకూడదు. మానవ ప్రయత్నం కూడా కావాలి. హోరుగాలిలో దీపం పెట్టి 'దేవుడా, నీ మహిమ' అంటే....."
"అలా అనకు, శేఖరం. ఎన్నడూ భగవంతుణ్ణి విస్మరించని వాళ్ళకయినా సరే, నాకేమని జబ్బ చరుకొని తిరిగేవాళ్ళకయినా సరే ఏదో ఒక సమయం వస్తుంది, శేఖరం. అప్పుడు అతడు భగవంతుడిని తలుచుకోక తప్పదు. జాన్ హెన్రీ న్యూమేన్ అని ఇంగ్లీషు కవి చెబుతాడు, వినలేదా, శేఖరం? 'ఈ శూన్యాంధకార వలయంలోంచి నాకు వెలుగుబాటని చూపించు. ఒక్క అడుగు చాలు. ఎన్నడూ నిన్ను జీవితంలో సహాయం కోరలేదు. యౌవనంలో నువ్వంటే లెక్కచేయక ప్రతీది నా స్వశక్తి అని విర్రవీగాను. కాని నేడు నీ సహాయం కోరక తప్పటం లేదు.' లీడ్ కైండ్లీ లైట్ అనే పద్యం అనుకుంటాను. మహాత్మాగాంధీకి కూడా అది ప్రియమైనదే."
