-
-
మూగవాని పిల్లనగ్రోవి
Moogavani Pillanagrovi
Author: Dr. Kesava Reddy
Publisher: Hyderabad Book Trust
Pages: 138Language: Telugu
Description
బక్కిరెడ్డి మరణం మొదట ఒక జాలి కబురుగా, ఆ పై క్రమంగా ఒక వీరగాథగా, చివరికి పంచభూతాలు అతనికి అనుగ్రహించిన వరప్రదానంగా ఇదంతా ఒక స్థల పురాణంగా రూపొందడం... ఇది ఒక రైతు మరణ, పునరుత్థానాల గాథ. ఈ కథలో పురాతన ఆసియా కథన సంప్రదాయాన్ని పాటిస్తూ, ఆదిమ జాతుల విశ్వాస ధోరణిలో చెప్పే నేర్పు వల్ల ఇంతదాకా తెలుగు సాహిత్యంలో మనం విని ఉండని అపూర్వ కథనాన్ని ప్రదర్శించారు రచయిత.
- వాడ్రేవు చినవీరభద్రుడు
పురాణగాథకు రచయిత వుండనట్లే, 'మూగవాని పిల్లనగ్రోవి'కి కూడా రచయిత లేడు. Mythsకు Author లేనట్టే ఈ నవలకు కూడా లేడనిపిస్తుంది. తన ఇంటలిజెన్స్‌ను నవల రాయడానికి ధారపోసి, తాను బేలగా మిగిలిపోయి రచయితగా, తన 'ఉనికి'కి ఆనవాళ్లు సైతం లేకుండా చేయడం ద్వారా కేశవరెడ్డి ఈ అపూర్వ విన్యాసాన్ని సాధించారు.
- అంబటి సురేంద్రరాజు
Preview download free pdf of this Telugu book is available at Moogavani Pillanagrovi
Great book...not to be missed... Kesava reddy gaaru..abinandanalu...kallolo kanneru teppinchaaru...bakki reddy katha..gaatha...
Sir I want hard copy please tell me how to got it
Chaaaaala baagundi..
Hrudayanni taakindi...
Kallamundu ooruni ooriloni manashulani valla atmiyatalanu choopincharu..
Mukyamga Bakkireddy vedananu avishkarinchina teeru manasuku hattukundi..
Chirakalam gurtundi poye navala idi