-
-
మూడో అందం
Moodo Andam
Author: Goteti Lalitha Sekhar
Publisher: Chinuku Magazine
Language: Telugu
Description
స్వాతిలో మీ కథ చదివాను. మీ కథ మా ఇంటిల్లపాదీ చదివి ఆనందించాం. ఇంత హాయిగా, నిశితంగా కథలు రాయగలిగిన మీరు ఇంకా ఎక్కువగా రాయకపోవటం అన్యాయం.
- ఇస్మాయిల్ , 19.5.1999
Preview download free pdf of this Telugu book is available at Moodo Andam
లలితా శేఖర్ రాసిన పదిహేడు కధల సంపుటి 'మూడో అందం'. పేరుకు తగ్గట్లే లలిత భావాల సుమబాల ఈ సంపుటి. స్వఛ్చమైన ఆత్మీయత అవసరాన్ని 'అహం' కధ చెబితే, పాత దృశ్యాలే అయినా కొత్త కోణంలోంచి చూడటమే సజీవ సృజనాత్మకత అని చాటుతుంది 'పిట్టకధ'. 'అందరూ మహానుభావులే' వంటి హాస్యకధలూ ఊన్నాయి. శరీరాన్నీ మనసునూ అధిగమించి ఆత్మగతమైన ఒకమానవీయ తాత్విక సౌందర్యమే రచయిత్రి దృష్టి లో 'మూడో అందం' అని గ్రహించగలుగుతాం.
మూడో అందం (కధలు); రచన: గోటేటి లలితాశేఖర్
పేజీలు: 143; వెల: రూ.90/-; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
-సుధామ
ఈనాడు ఆదివారం 11-4-2010