-
-
మనీపర్స్ - 14వ ముద్రణ
Money Purse Edition 14
Author: Vanga Rajendra Prasad
Publisher: Vanga Padmaja
Pages: 143Language: Telugu
సంపాదనని సంపదగా మార్చే మనీపర్స్ - 14వ ముద్రణ (తాజా సమాచారంతో)
ఇది ఒక జీవద్గీత
మన చెయ్యి పట్టుకుని మంచిదారిలో నడిపించే నిజమైన నేస్తమే వంగా వారి 'మనీపర్స్'. ఈ చిన్న గొప్ప పుస్తకం... ఇదొక జీవద్గీత.. ఆ జీవనామృతాన్ని ఆరగించండి-గించి తరించండి.
- ముళ్ళపూడి వెంకటరమణ
ఇండియాటుడే, 15 మార్చి 2011
* * *
డబ్బు, పెట్టుబడుల గురించి సాధారణ వ్యక్తులతోబాటు చదువుకున్న వారిని విద్యావంతులుగా చేసే గ్రేట్‌వర్క్ మనీపర్స్, ఎంతో ఆసక్తితో చదివా, సరళమైన శైలిలో పవర్‌ఫుల్‌గా ఉంది.
- యండమూరి వీరేంద్రనాథ్
* * *
డబ్బులు చెట్లకు కాస్తున్నాయా?... అవును కాస్తాయి!! విత్తునాటే నేలను బట్టి చెట్టు పెరుగుదల, ఫలాలు ఉంటాయి. రూపాయి కూడా అంతే! నువ్వు దాన్ని పోస్టాఫీసులో నాటుతావా? బ్యాంకులో , నాటుతావా? షేర్స్‌లో నాటుతావా? ఇంటిపై నాటుతావా? బీమాలో నాటుతావా? లేదా అన్నీ కలిపిన నేలలో నాటుతావా? అన్నదాన్ని బట్టి ఫలం. మరి ఎక్కడ నాటాలి? మీరు ఎవరినీ అడగాల్సిన పని లేకుండా వంగా రాజేంద్రప్రసాద్ చెబుతారు. ‘ఫీజు’ రూపాయలు. 'చదువులు మనకన్నీ, నేర్చుతాయి. డబ్బును ఎలా వాడుకోవాలో తప్ప' అన్న 'రిచ్‌డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు మిమ్మల్ని ఆలోచనల్లో పడేసి ఉంటే ఆ మిగిలిన ఒక్క నైపుణ్యాన్ని నేర్పే టీచరే ఈ పుస్తకం. పత్రికల్లో ఆర్థిక సలహాలు అందిస్తున్న రాజేంద్రప్రసాద్ వృధా వాక్యాలు వాడకుండా ఇంత సరళంగా ఆర్థిక పాఠాలెలా చెప్పారన్నదే పెద్ద ప్రశ్న.
-
సాక్షి దినపత్రిక
7 మార్చి 2010
* * *
సంసారం, సంపద ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.
- వార్త
18 ఏప్రిల్ 2010
