-
-
మనీ మనీ మనీ
Money Money Money
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 254Language: Telugu
చేతిలో డబ్బు ఉండగానే ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే ప్రయత్నం చేశాడు. ఫలితం కనిపించలేదు. ఒక్క రూపాయి ఆదాయం లేకపోగా ఉన్న డబ్బు ఖర్చైపోతే ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? తిరిగి సాగర్‌కి ఫోన్‌చేసి డబ్బు అడగాలా? అడగడానికి మనసు అంగీకరించటం లేదు.
ఆ ఉదయం లాడ్జిలోంచి బయటికి వస్తుండగా అనుకోకుండా కావేరి అతని కంటపడింది. గతంలో ఆమెను చూసిన రెండుసార్లు కూడా యాక్సిడెంటల్ గానే చూడటం జరిగింది. మొదటిసారి టెంపో యాక్సిడెంట్... రెండోసారి అనుపమ బార్ ముందు రౌడీలతో... ఇప్పుడు ఆమె స్కూటీమీద పోతూ కనిపించింది. ఆమెకు ముందు అదే టెంపో వ్యాన్... అదే డ్రైవర్. సరుకు డెలివరికీ వెళ్తున్నట్టున్నారు.
అప్పటికన్నా ఇప్పుడు మరింత గ్లామర్‌గా మారింది. మెరిసిపోతోంది. ఆమెను కాపాడిన పాపానికి తను బాధలు పడాల్సి వచ్చింది. తను మాత్రం హ్యాపీగా వ్యాపారం చేసుకుంటూ తిరుగుతోంది. ఆమెను ఆపి కసితీరా తిట్టాలని ఆవేశం తన్నుకొచ్చింది. నిగ్రహించుకున్నాడు. చూస్తుండగానే అదృశ్యమైందామె. తన రాత సరిగాలేనప్పుడు ఒకర్ని నిందించి లాభం లేదు.
సరిగ్గా పదకొండో రోజు పగలు పన్నెండున్నర గంటలకి బొల్లారం మెయిన్ రోడ్డులో దిగాడు. అప్పుడు అతని దగ్గర మిగిలింది ఒక్కరూపాయే.
ఓసారి చుట్టూ పరిశీలించాడు. విశాలమైన రోడ్లు... అటూ ఇటూ షాపులు, టీ స్టాల్లు కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన ప్రాంతంలా ఉంది. తను ఉన్నచోటుకు ఎదురుగా సువిశాలమైన ఖాళీ స్థలాన్ని ఆనుకుని ఉన్న పెద్ద రేకుల షెడ్డులో ఒక భోజన హోటల్ కనబడింది. హోటల్ని చూడగానే ఆకలి గుర్తొచ్చింది. జేబులో ఉన్న ఒక రూపాయి చూసుకోగానే నిస్పృహ చుట్టేసింది. ఆకలికి తట్టుకోలేక ఎదురుగా చూశాడు.
Ok
Time pass