-
-
మోడ్రన్ టైలరింగ్ కోర్స్
Modern Tailoring Course
Author: K. Vani Prabhakari
Publisher: Shaili Publications
Pages: 106Language: Telugu
ఫ్యాషన్ ప్రపంచంలో క్షణానికో ట్రెండ్ వస్తుంది. ఆ ట్రెండ్‌కు తగ్గట్టు మనలను మనం ఆధునికరించుకోవాలి. అపుడే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. నలుగురి దృష్టిని ఆకర్షించేది మనం వేసుకున్న బట్టలే. మనం ధరించిన దుస్తులను బట్టే మన మనసు తెలుసుకునే వారు ఉంటారు. ఈ విషయం తెలిసిన ఫ్యాషన్ డిజైనర్లు ఎప్పటికప్పుడు దుస్తుల తయారీలో కొత్తపుంతలు తొక్కుతుంటారు.
మార్కెటు వచ్చే కొత్త కొత్త డ్రస్సుల ధరలు మాత్రం ఆకాశంలో ఉంటుంటాయి. వాటిని ధరించాలన్న కోరిక, కొనలేని అసక్తత రెండూ మనిషి నిలువనియ్యవు. అట్లా ఫ్యాషన్ ప్రపంచంలో వచ్చే కొత్త ట్రెండ్ దుస్తులను మనకు మనమే తయారుచేసుకునే వీలుంటే ...
కొత్త ట్రెండ్‌కు తగ్గట్టుగా మీకు మీరే దుస్తులను కుట్టుకునే టైలరింగులో మెళుకువలు నేర్పే మీ ‘శైలీ' టైలరింగు బుక్.
అంతేకాదు మీరు మీ కాళ్ల మీద నిలబడాలన్న తపన ఉన్నా సరే ఈ బుక్ చదివితే చాలు అన్ని రకాల దుస్తుల తయారీని మీరు పట్టేయొచ్చు. స్వయంఉపాధి మార్గాన్ని మీరు మొదలెట్టేయొచ్చు. శరీర కొలతలు ఎలా తీసుకోవాలి, ఆదికిచ్చిన బట్టల కొలతలు ఏరకంగా తీసుకోవాలి అన్న దగ్గర నుంచి ఏ నమోనాను ఎలా కత్తిరించుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అన్న దగ్గర దాకా అన్ని రకాల సందేహాలకు సమాధానం ఈ శైలీ టైలరింగు ఇస్తుంది. నెక్, భుజాలు, వెనుక భాగం ఇలా ఏదైనా సరే వాటిని ఎలా కత్తిరించుకోవాలి? ఎలా కుట్టుకోవాలి? అందమైన జాకెట్లు కుట్టడమే కాదు వాటికి గ్రాండ్ లుక్ రావాలంటే ఏం చేయాలో కూడా ఇందులో పొందుపరిచి ఉంది. పుస్తకం తెరవండి. కుట్టుమిషన్ ఆన్ చేయండి. మీరు కోరుకున్న అందమైన దుస్తుల రూపాన్ని ఆవిష్కరించండి.
ఇక మీదే ఆలస్యం.
- వాణి ప్రభాకరి
గమనిక: " మోడ్రన్ టైలరింగ్ కోర్స్ " ఈబుక్ సైజు 5.4mb
Thank you I got to open the book through a dope ID. I need this book physically into my hands if possible . Please give me some way and send me email to get how this one