-
-
మొదటిపేజి
Modatipeji
Author: A.N.Jagannadha Sharma
Publisher: Amaravathi Publications
Pages: 371Language: Telugu
నవ్య వారపత్రికలో ‘మొదటిపేజి’ శీర్షికతో వచ్చిన రచనల సంకలనమే ‘జగన్నాథశర్మ మొదటి పేజి’. మన చుట్టూ జరిగే సంఘటనలనే వస్తువులుగా తీసుకుని, చక్కటి కథలుగా (మొత్తం 180) అల్లారు. ఇవి పాఠకుణ్ని నవ్విస్తాయి.. కవ్విస్తాయి.. ఏడిపిస్తాయి.. బుజ్జగిస్తాయి. ‘అరే.. ఇవి మనకు సంబంధించిన కథలే కదా’ అనిపిస్తాయి. ‘ఓ బొజ్జ గణపయ్య’లో నవరాత్రి సంబరాలు, ‘బోగిమంట’లో పిల్లలంతా కలసి చెట్లకొమ్మలు, కోళ్ల గూళ్లు, విరిగిన మంచాలు సేకరించడం లాంటివి పాఠకుల జ్ఞాపకాలను తట్టిలేపుతాయి. ఎప్పటికీ తీర్చుకోలేనిదంటూ ‘తల్లిఋణం’ కథలో అమ్మ గొప్పతనాన్ని చక్కగా చెప్పారు. ’మల్లేష్ ఆటో సర్వీస్’, ‘రిక్షారాణి’ లాంటివి స్ఫూర్తి కథలు. ‘అమ్మఒడి’, ‘హ్యేపీ న్యూ ఇయర్’, ‘నాన్నా నీ మనసే వెన్న’, ‘ట్రంకుపెట్టె’ లాంటివి కుటుంబ అనుబంధాలకు అద్దంపడతాయి. ‘..చుట్టం చూపుగా వచ్చిపోయేవాళ్లు ముఖ్యం కాదోయ్! మనతో కలిసిమెలిసి ఉండేవాళ్లు ముఖ్యం! రేపు లేచినదగ్గర్నుంచీ చూసేది కాలనీ వాళ్లని గాని, కన్నుకి అందనంత దూరంగా ఉన్న నీ వాళ్లనీ, నావాళ్లనీ కాదు’ లాంటి మాటలు (‘ఇరుగు పొరుగు’లో) ఆలోచింపజేస్తాయి.
- గణేశ్
