Description
అన్నారులే...!
- మృత్యుపుష్ప పరాగం
- మోషో
- ఏమో 'మో' ఏమేమోకామోసు
- కొలనులో ఓడ
- కలలో వచ్చే పాదరసపు నది
- ఇంటీరియర్ 'మో' నోలాగ్
- అపరిచిత స్పర్శ
- భగ్నశిల్పి
- సమ్మిశ్ర చాపుతాళం
- నీవెంత నెరజాణవురా
-నన్నిలా
సీతారం గారి 'ఆరున్నొక్కరాగం' అను ముందు మాట నుండి
"... ఈ నిషాదంలో ఇంచుమించు 71 కవితలున్నాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ క్రమం మొదలై రెండు దశాబ్దాలు ముగిసాయి. రెండో దశాబ్దంలో తెలుగు సమాజ సంక్షోభం మొత్తం ఈ సంపుటిలో ఉంది. ఒక దశాబ్ది కవిత్వాన్ని నిషాదం గా సంపుటీకరించాడు. ఇది విషాదంలా కూడా వినపడుతుంది. అయితే "పురందర దాసు ముందు / పొగులుతున్న భీమ్సేన్ జోషి" అని కొంచెం కీ లాంటి క్లూ ఇచ్చినప్పుడు మాత్రం సంగీతంలోని నిషాదం అంటున్నాడని అనుకోవాలి. గానకళకు పునాది సప్త స్వరాలు. అందులో నిషాదం సప్తమ స్వరం. ఏనుగు ఘీంకారమే నిషాదంగా జనించిందని గాన కళాబోధిని వివరిస్తోంది. కవిత్వ కళాబోధిని మనకెటూ లేదు కనుక సంగీత శాస్త్ర పరిభాషా పదాన్ని కవిత్వానికి అనవయించుకోవటం కొత్తే. సప్త స్వరాలలో రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాదాలకు రెండేసి బేదాలుంటాయి. వీటిని వికృతి స్వరాలంటారని కా.క.బో అంటోంది. షడ్జమ, పంచమ స్వరాలకు వికృతి భేదం లేదు కనుక అవి ప్రకృతి స్వరాలు. కవి ఏమంటున్నాడు? నేను వికృతి స్వరంలో పాడుతున్నాను ఈ సమాజ వికృతాన్ని, దుష్కృతాన్ని, దష్మృత్యాన్ని, దురాగతాన్ని, దుర్మార్గాన్ని అని. ....."
Preview download free pdf of this Telugu book is available at Mo Nishadam
ఈ పుస్తకంపై ప్రముఖ రచయిత సుధామ చేసిన సమీక్షని ఆంధ్రభూమి వారపత్రిక ప్రచురించింది. ఈ లింక్ లో సమీక్ష చదవచ్చు.