• Mitturodi Pustakam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిట్టూరోడి పుస్తకం

    Mitturodi Pustakam

    Author:

    Publisher: Tom Sawyer Books

    Pages: 608
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 6 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 premium votes.
Description

అన్నం తినేసినా. ఇంక ఆరాతీరా చెయ్యి నాక్కోవాల గదా, నాకతా వుండా.

“చెయ్యి నాకద్దురా దరిద్రపు మొగోడా! నీకంతగా కావాలంటే చెప్పు- ఎంత తింటావో అంత కూడు మళ్ళా పెడతా!” అని కసురుకొనింది మా దెయ్యం మొకంది.

అన్నం చాలక గాదు నేను చెయ్యి నాక్కొనేది! తిన్నంత సేపు చెయ్యి నాకందే నాకు తిన్నట్టుండదు. దీన్ని మా నాయిన్నుంచి నేర్చుకున్నా, భద్రంగా కాపాడకొస్తుండా.

సరే, ఇది పూట పూటా వుండే గలాటే లే!

ఒక కొంగు కనిపించి టకీమని మాయమైంది. అంతే, చెయ్యి నానోట్లోకి పోలా. ఈదిలోకి పొయ్ చూద్దును గదా- మా కంసలోళ్ళ శివమ్మ కూతురు.

అదిప్పుడు పరావూరి కోడాల్లే. నేను ఐద్రాబాదులో వుండంగానే అది వొకింటిదై పొయ్యింది.

“ఏమే, ఎంతదా అక్కర తీరే పొయ్యిందనుకో- ఇంక అంతేనా? వూళ్ళేకొచ్చి నాక్కనపడకుండానే తిరగతా వుండావు గదే! ఎప్పుడు దిగినావే వూళ్ళో నా సిన పెళ్ళామా?” అంటా దాన్ని అడ్డగించుకున్నా.

“యెయ్యి రూపాయల జీతగోడివై పోతివి గద మామా. అప్పుడంటే మాతో గూడా ఎనుములు మేపతా వుంటివి. ఇంకనువ్వు – కనిపించినా మా బోటోళ్ళతో మాట్లాడబోతావా సామీ!” అననిందది.

“అట్టా కత మన్దగ్గిర లేద సేయ్! నేనప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ నీ చేతల్లో మనిసినే లేయే పిల్లా!” అని దానిక్కొంచిం దైర్నం యిచ్చినా.

“మాయమ్మ వూరెత్తక పొయ్యేటట్టు నా కోసరం అరస్తా వుండబోతింది. బైటొచ్చి శానా సేపైంది. తింటా వున్నట్టున్నావు తినుబో, మళ్ళొచ్చి మాట్లాడతా.” అనేసి అది పొయ్యింది.

Preview download free pdf of this Telugu book is available at Mitturodi Pustakam