• Mithyachakravarti
  • Ebook Hide Help
    ₹ 85.2
    94.8
    10.13% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిథ్యాచక్రవర్తి

    Mithyachakravarti

    Pages: 117
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మౌర్యవంశ చక్రవర్తులలో రెండవవాడైన బిందుసారుడు క్రీ.పూ. 297వ సంIIరంలో మగథ సింహాసనాన్ని అధిరోహించాడు. ఇతని హయాములో ఇతని కుమారులైన సుసీముడు, అశోకుల మధ్య వారసత్వపోరు సాగింది. అందులో అశోకుడు జయించి, బిందుసారుని తర్వాత మగథ సమ్రాట్‌గా పట్టాభిషిక్తుడైనాడు.
ఈ పోరులో అశోకునికి వెన్ను దన్నుగా నిలబడి, అతని విజయంలో కీలక భూమిక పోషించిన ఒక కల్పిత పాత్ర యశోవంతుడు. ఈ యశోవంతుడు ఎవరు? అతనికి అశోకునితో పరిచయం ఎలా ఏర్పడింది? ఆ పరిచయం ఏ పరిణామాలకు దారితీసింది? అతను తన కుటిల రాజకీయ చతురతతో తన మిత్రుడైన అశోకుని ఎలా, ఎందుకు మగథ చక్రవర్తిగా పట్టాభిషిక్తునిగావించాడు? అన్నది ఈ నవల కథాంశం.

Preview download free pdf of this Telugu book is available at Mithyachakravarti
Comment(s) ...

డేగ రెక్కల చప్పుడు లా ఉత్కంఠ కలిగించిన " మిథ్యా చక్రవర్తి " నవల.
.............
ఏకబిగినగా(one go) ఒక నవల చదివి చాలా రోజులు అయింది. యండమూరి నవలలు ఆపేయడం మూలంగా ఏమో అసలు నవల చదవడం ఆపేసాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత Yeswanth Maramreddy రచించిన మిథ్యా చక్రవర్తి అనే నవల చదివాను (ఏకబిగినగా). ఒక రచయితకి అన్నిటికంటే ఉండాల్సింది తార్కిక ఆలోచనా శక్తి (Power Of Logical Thinking). ప్రజీతపురి లో ఒక హోటల్ నడుపుకునే యువకుడు, తన మాట వినకుంటే మౌర్య సామ్రాజ్యమే కూలిపోయే స్థాయి కి ఎలా ఎదిగాడు? అని తెలుసుకునే దాకా నవల చదవడం ఆపనీయకుండా ఉత్కంఠ కలిగించడం లో రచయిత యశ్వంత్ విజయం సాధిచాడు. 👍