-
-
మిథ్యాబింబాలు
Mithyabimbalu
Author: P. S. Narayana
Pages: 267Language: Telugu
ఆమె చటుక్కున లేచి కూర్చొని, "చేయి చూచి నా వ్యాధి నిర్ణయం చేయగలిగే పక్షంలో మీరు ఘటికులే, డాక్టరు బాబూ, అయినా మీరన్న మాటకు నేనెందుకు అభ్యంతరం చెప్పాలి?" అన్నది. మరుక్షణంలోనే బంగారుతో పోతపోసిన చేయి సారథి కళ్ళముందు తళుక్కున మెరిసింది.
సారథి ఆమె మాటలకు నిర్విణ్ణుడయ్యాడు. ఆమె నడతలోకాని, ఆమె మాటల్లోగాని భావం ఏ మాత్రం అర్థం కావటంలేదు.
చికాకు కనబరుస్తూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, నాడి పరీక్షిస్తూ, "మీ చేష్టలూ, మాటలూ నాకు ఏమీ అర్థం కావడం లేదు. మీరు నన్ను ఎందుకు పిలిపించారో కూడా నాకు తెలియడం లేదు. ఒక సభ్య కుటుంబంలోని వ్యక్తిని అవమానించటానికే మీరు పూనుకున్నట్లయితే మీకిది ఎంత మాత్రం తగదని మీ ముఖాననే చెప్పగలను. క్షమించాలి! వస్తాను!" అని వెనుదిరిగి ద్వారం వేపు అడుగులు వేయసాగాడు.
గడప దాటుతుండగా ఆమె వేడి నిట్టూర్పులు అతడిని మరింతగా కలవరపరిచినాయి!
తరువాత కొన్ని దినాల వరకు ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన మనస్సులో మెదిలినప్పుడు, ఆమె భావాలు అర్థమయినప్పుడు, చికాకే కాకుండా, రామనాధంగారి అతిలోక సుందరి అయిన మూడవ భార్యమీద అంతులేని అసహ్యమూ, ద్వేషమూ కలిగేవి సారథికి!
