• Miss Vasudha At Room Number 3A
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిస్ వసుధ @ రూమ్ నెంబర్ 3A

    Miss Vasudha At Room Number 3A

    Author:

    Pages: 108
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 21 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 20 premium votes.
Description

"చెప్పండి మిస్టర్ ప్రసన్న కుమార్. మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా? " ఆయన ముఖం లోనికి పట్టిపట్టి చూస్తూ అడిగాడు.
పది క్షణాలు మౌనంగా ఉన్న ప్రసన్న కుమార్ "మిస్టర్ వినయ్... ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను చూసింది, విన్నది నిజమో కాదో కూడా తెలియడం లేదు..." అయోమయంగా అన్నాడు.
వినయ్ మరియు కృష్ణలకు అర్ధం అయింది. ఆయన చెప్పబోయే విషయం ఎదో ముఖ్యమైనదని. "చెప్పండి.... నిర్భయంగా మీరు ఏమి విన్నారో చూసారో చెప్పండి. మీకు ఎటువంటి సమస్య లేకుండా చేసుకుంటాము." అతని భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు వినయ్.
"సర్... కనకయ్య శవాన్ని చుసిన తరువాత పెద్దగా అరిచాడు. వెంటనే రఘురాం గారి గది వద్దకు వచ్చి చెప్పాడు. అందరు లెక్చరర్లకు చెప్పాలని క్రిందకు పరిగెత్తాడు. ఆ సమయంలో నేను ప్రిన్సిపాల్ రూమ్ పక్కనే ఉన్న మరొక రూంలో ఉన్నాను. విన్న వెంటనే నేను కూడా షాక్ లోనే ఉన్నాను. ఎవరితోనో మాట్లాడుతూ బిజీగా ఉన్న ప్రిన్సిపాల్ గారు కూడా వెంటనే బయటకు వచ్చారు. అప్పుడు..."
"చెప్పండి... అప్పుడు ఏమి జరిగింది..." కూల్ గా అడిగాడు.
" వసుధ ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసింది."
"వాట్?" కుర్చీలో నుంచి తూలి ముందుకు పడబోయి తమాయించుకున్నాడు వినయ్.
"అవును సర్... రఘురాం గారి మొబైల్ కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ చేసింది వసుధ."
"చనిపోయిన మనిషి ఫోన్ చేయడమా... మిస్టర్ ప్రసన్న కుమార్... మీరు ఏమి మాట్లాడుతున్నారు!!! ఆమే ఫోన్ చేసిందని మీకు ఎలా తెలుసు... "
"నేను కూడా ముందు వేరే వసుధ అనుకున్నాను. రఘురాం గారు మాట్లాడిన మాటల వల్ల ఫోన్ చేసింది లెక్చరర్ వసుధ అని, ఆమె ఎదో ప్రమాదంలో ఉందని తెలిసింది. అందరూ కలిసి తమాషా చేస్తున్నారా అని ఆ కాల్ చేసిన వ్యక్తి (వసుధ?) మీద కోపగించుకున్నారు కూడా..."
ఒక్క నిమిషం పోలీసులు ఇద్దరికీ ఏమి అర్ధం కాలేదు. ముఖముఖాలు చూసుకున్నారు.
"ఇట్స్ స్ట్రేంజ్ మిస్టర్ ప్రసన్న కుమార్... "
వినయ్ లేచి నిలబడి అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. ఒక ప్రక్క కృష్ణ పరిస్థితి కూడా అలాగే ఉంది.
"మీకే అలా అనిపిస్తే అసలే షాక్ లో ఉన్న నాకు ఇంకెంత గందరగోళంగా ఉంటుందో అర్ధం చేసుకోండి. ఇది నిజంగా జరిగిందా నా భ్రమా అని ఇంకా తేల్చుకోలేక పోతున్నాను."
"అంతే కాకుండా ఇప్పటి వరకు ఆ ఫోన్ విషయం ఎవరితో, కనీసం మీతో కూడా ఆయన చెప్పలేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది." తిరిగి అన్నాడు ప్రసన్న కుమార్.

Preview download free pdf of this Telugu book is available at Miss Vasudha At Room Number 3A
Comment(s) ...

సస్పెన్స్ చాలా బాగా ఉంది. క్రొత్తగా అనిపించింది. Worthy buying and reading. Nice novel

I bet, this is one of the best suspense novel.....

Nice story. I also read http://kinige.com/book/Maya Kankanam Mantrala Mani of this writer. it was also very good novel.

super novel... ఆపకుండా చదివించిన కథ....

నేను చదివిన పుస్తకాలలో దిస్ ఇస్ వన్ అఫ్ ది బెస్ట్, రైటర్ తాలూకు ఆలోచన విధానం, వాడిన బాషా చాల బాగుంది.

can you enable rent option.