• Misimi January 2011
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిసిమి జనవరి 2011

    Misimi January 2011

    Author:

    Publisher: Bapanna Alapati

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ శతాబ్దంలో మొదటి దశాబ్దం పూర్తయింది. ఈ పది సంవత్సరాలలో తెలుగులో కథ, నవల, కవిత, భాషా చరిత్ర, విమర్శ ప్రక్రియలే కాకుండా మాండలికాల అస్తిత్వ ధోరణుల్లో వచ్చిన ప్రయోగాత్మకమైన మార్పులు తులనాత్మకంగా పరిశీలించవలసిన అవసరం వుందని పలువురు రచయితలకు ఉత్తరాలు పంపాము. పత్రికా ముఖంగా కూడా ఇదే విషయం తెలియజేస్తూ ఈ దిశలో తమ రచనలు పంపవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. పత్రిక పరిమితులకు లోబడి ఈ వ్యాస పరంపరను ప్రచురించాలని అభిలషిస్తున్నాము.

అహింసనే ఆయుధంగా చేసుకుని మహాసామ్రాజ్యానికి ఎదురు నిలబడి పోరాడిన మహాత్ముని జీవితం హింసతోనే అంతమయింది. ఆ క్షణాలలో అక్కడ వున్న ఇద్దరి వ్యక్తుల ప్రత్యక్ష కథనం 'బాపూ దారిచూపు. '

త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఎంతో సంరంభంగా ప్రతి ఏటా జరుగుతాయి. అయితే ముళ్ళపొదల్లో మరుగున పడిన త్యాగరాజ సమాధిని ఉద్ధరించి, తన సంపదను, జీవిత శేషాన్ని ఆయన ఆరాధనోత్సవంలో తరింపజేసుకున్న 'నాగరత్నమ్మ' ప్రస్థానం తెలుగువారందరూ తెలుసుకోదగినది.

సామాన్యునికి సంగీతం అంటే సినిమా పాటలే - కాని సరిగమలు నేర్చుకోవాలనే ఆరాటం అందరిలోనూ ఉంటుంది. అదెలా సాధ్యమో మల్లిఖార్జున శర్మ 'సరిగమకాలు' అనే వ్యాసంలో వివరించారు.

'సంక్రాంతి లక్ష్మి'ని శీలా వీర్రాజు రంగులవల్లిగా చిత్రించారు. సంక్రాంతి అంటే 'పంటల పండగ'. ఇది అన్ని నాగరికతలలోనూ ఉన్నది. నాగలి పన్ని దుక్కిదున్ని, ఆరుగాలం కష్టపడి పంట పండించి - పండగ చేసుకునే రైతు - ప్రకృతి వైపరీత్యం పుణ్యమా అని నేడు దయనీయ స్థితిలో ఉన్నాడు... అయినా పండగ వస్తుంది, వెళ్ళిపోతుంది.

పోలవరంలో మునిగిపోతున్న పాపికొండల కోనల్లో వెన్నెల అందాలు ముందు ముందు కానరావేమోననే ఇంద్రగంటి వారి ఆందోళన మనందరిదీ కూడా.

డిసెంబరు సంచికకు పాఠకులనుంచి వచ్చిన ఎనలేని స్పందనకు కృతజ్ఞతలు.

'మిసిమి' పాఠకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

-సంపాదకులు.

Preview download free pdf of this Telugu book is available at Misimi January 2011