-
-
మిసిమి చిత్ర కళా నీరాజనం
Misimi Chitra Kala Neerajanam
Publisher: Misimi Prachuranalu
Pages: 261Language: Telugu
మిసిమి అంటే నవనీతం, మెఱుపు అనే అర్థాలుండగా మిసిమి అంటే ఒక చల్లని చంద్రకాంతిలాంటి పుస్తకం. మౌలిక ఆలోచనాస్రవంతిని ఉన్నతీకరించే చింతనాత్మక సాహిత్యం అనే ఒక కొత్త అర్థాన్ని చెపుతూ నిఘంటువుని మార్చవలసిన అవసరాన్ని కల్పించారు ఆలపాటి రవీంద్రనాథ్. సారస్వతానికి, లలిత కళలకు గౌరవాన్ని ఆపాదిస్తూ ఒక పత్రికను స్థాపించి, ప్రచురించబడే విషయాల ఎంపికలో అత్యున్నత ప్రమాణాలను నిలుపుకుంటూ గత ఇరవై అయిదు సంవత్సరాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ పత్రిక, పేరుకు తగ్గట్టుగా ప్రతి నెల అందమైన చిత్రాలతో కళాత్మకతకు పెద్దపీట వేస్తూ మిసమిసలాడుతూ పాఠకులను పలకరిస్తుంది, పులకరింపజేస్తుంది. తెలుగు భాషలోనే కాదు, మిగిలిన భారతీయ భాషల దేనిలోనూ ఒక పావు శతాబ్దం పాటు ముఖచిత్రాలను కళాత్మకంగా ప్రచురించటం ఒక్క మిసిమి కే చెల్లింది.
తెలుగు సాహితీ వనంలో పూసిన సౌగంధిక పుష్పం మిసిమి. బంగారానికి తావి అబ్బినట్టు మిసిమికి ముఖచిత్రాలు మరింత శోభను చేకూర్చాయి అని మేము సగర్వంగా చెప్పగలుగుతున్నాం.
మిసిమి పాతికేండ్ల పండుగ సందర్భంగా జరిగిన పాఠకుల సమావేశంలో కొన్ని సూచనలను అనుసరించి, ఎంపిక చేసిన ముఖచిత్రాలను ఒక సంచికగా సమీకరించి మీ ముందుంచుతున్నాం.
- కాండ్రేగుల నాగేశ్వరరావు
వల్లభనేని అశ్వినీకుమార్
