-
-
మైండ్ పవర్ (సేత్ విజ్ఞానం)
Mind Power Seth Vignanam
Author: V V Ramana
Publisher: Akshara Publications
Pages: 280Language: Telugu
మీ సంకల్పం అనేది అంతర్ ప్రపంచం... అంటే అంతర్శక్తి నుండి వెలువడుతుంది. అంతర్శక్తి నుండి వెలువడిన ప్రతి సంకల్పమూ విద్యుదయస్కాంత శక్తిని కలిగి వుంటుంది. మీ సంకల్పాలు, ఆలోచనలు విశ్వశక్తిని కలిగి వుండి అంతర్ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి వెలువడినపుడు భౌతిక సంఘటనలను ప్రభావితం చేస్తాయి. భౌతిక సంఘటనలలోని అతి
సూక్ష్మాతి సూక్ష్మమైన ధర్మాలను ప్రభావితం చేసి మీ ఆలోచనలకు అనుగుణంగా మల్చబడతాయి. మీ మనోశక్తి నుండి వస్తున్న ప్రతి సంకల్పమూ బాహ్య ప్రపంచంలోని భౌతిక పరిస్థితులను తారుమారు చేస్తూ వుంటాయి. చెస్‌గేమ్ (chess game)లో ఒక పావును (pawn) కదిపితే ఆట స్వభావం మారిపోతున్న రీతిలో మీ ఒక్కొక్కొ సంకల్పమూ మీ జీవితంలో తారసపడే భౌతిక సంఘటనల స్వభావాన్ని మార్చేస్తుంటుంది. నదీ ప్రవాహం ఏక్షణానికి ఆ క్షణం మలుపు తిరుగుతున్నట్లే, జీవితప్రవాహం కూడా మలుపు తిరుగుతుంటుంది. వర్తమానంలో మీ నుండి వెలువడే ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పం మీ జీవితాన్ని మలుపు త్రిప్పుతుంది.
నిరాశ, దుఃఖం, దరిద్రం, రోగంలాంటి వాటి నుండి మీ దృష్టిని మరల్చి ఆనందం, ఆరోగ్యం, అద్భుతమైన జీవితంపట్ల కేంద్రీకరించండి. మీ అంతర్శక్తి యొక్క అనంతమైన ఇంటెలిజన్స్ (infinite intelligence) పట్ల నమ్మకం కలిగి వుండండి. జీవితంలో ఎల్లవేళలా మంచే జరుగుతుందని ఆశాకర దృక్పధాన్ని కలిగి వుండండి. ఆ దృక్పథమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మిగతా కార్యాన్ని మీ అంతర్ ప్రపంచం నడిపిస్తుంది.
ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీ ఆధ్యాత్మిక శక్తి మరియు మనో వికాసం ఎన్నో రెట్లు విస్తరింపబడతాయి; మీ యొక్క చైతన్యశక్తి (consciousness) ఎన్నో రెట్లు పెరుగుతుంది. కేవలం ఒక్కసారి మాత్రమే చదువతగ్గ పుస్తకం కాదిది. 'మనో శక్తి' మరి 'భౌతిక వాస్తవం' అధ్యాయాల ద్వారా తెలుగుజాతి యువతకు, విద్యార్థులకు ఎంతో స్ఫూర్తి మరి ఉత్తేజం కలుగుతాయి. ఆ రెండు అధ్యాయాలే కాకుండా అన్ని అధ్యాయాలూ మీకు ఎంతో గైడెన్స్‌ను ఇచ్చి మీ ఆధ్యాత్మికతను మరి ఆత్మ జ్ఞానాన్ని పెంచుతాయి.
Use digital editions app in google play store to read rented books
I am not able download in AIdiko. I am getting unknown title, download incomplete error
I have rented this book but could not be able to download it in AIdiko. Can anybody help me please
I need printed copy of this book