• Meghana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మేఘన

    Meghana

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అదే చిరునవ్వుతో ఏ మాత్రం తత్తరపాటు లేకుండా తదేకంగా చూస్తున్నదామె.

‘‘ఏమిటి? ఎందుకలా చూస్తున్నదామె?

ఆ చూపుల్లో ఏదో ఆర్తి, ఆర్ద్రత వ్యక్తమవుతున్నాయి. ఏమో...! ఆమె మామూలుగానే చూస్తున్నదేమో..? నేనే రకరకాల భాష్యాలు చెప్పుకుంటున్నానేమో..?

కాదు... కాదు... ఏదో ఉంది... ఆ ఆర్తి... ఆర్ద్రత... అబద్దాలు కావు. అయినా ఒక పేషంటు గురించి ఎందుకిలా పరిపరి విధాల ఆలోచిస్తున్నాను నేను?

‘‘తీగలాంటి దేహం కలిగి, చక్కని మేని ఛాయతో, రూపురేఖలతో, తన సమక్షంతో ఎదుటివారిపై వెన్నెల హాయిని కురిపించి, తన చిరునవ్వుతో ప్రపంచాన్ని మరిపింపజేసే... ఈమెపై ఇంత రాక్షసంగా.. కర్కశంగా... కక్షగా.. క్రూరత్వాన్ని కురిపించిన రాక్షసాధముడెవడు? వాడసలు మనిషేనా? పశువా? కృారమృగమా? బంధువా? భర్తా?’’ ఆలోచనలతో హరి బుర్ర వేడెక్కుతుండగా...

‘‘భర్త... నా భర్త...’’ అన్నదామె వినబడీ వినబడనట్లుగా.

‘‘ఏమిటీ... నా ఆలోచనలు ఈమె కళ్లకు కనబడుతున్నాయా..! సరిగ్గా పుస్తకం చదివినట్లుగా నా మనసులోని భావాలు ఎలా చదవగలిగింది?’’

కలవరపాటును కప్పిపుచ్చుకుంటూ... గంభీరంగా... ‘‘ఆఁ... ఏమన్నారు... మేఘనగారూ... ’’ అన్నాడు.

‘‘నా భర్త వల్లనే నాకీ గాయాలయ్యాయని అంటున్నాను డాక్టర్‌’’ ఏ భావమూ లేకుండా అన్నదామె.

‘‘ఓహ్... ఐయామ్‌ సారీ.... మీ గాయాలు త్వరగానే మానిపోతాయి. నేనిచ్చిన ఆయింట్‌మెంట్‌ కంటిన్యూ చేయండి.
ఏంటీ బయోటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌ రాసాను. కేవలం మూడు రోజులు వాడండి. ఎక్కువ రోజులు వాడకండి.. నొప్పి అనిపిస్తేనే. ఆ తర్వాత కూడా ఒక్క రోజు మాత్రమే పెయిన్‌ కిల్లర్స్‌ వాడండి. అంతకీ నొప్పి ఎక్కువైతే డామేజ్‌ ఆసెస్మెంట్‌ కోసం ఎక్స్‌రే, మిగిలిన టెస్టులు చేయిద్దామండి. నా ఉద్దేశంలో పెద్దగా డామేజి లేదు. అవసరమైతేనే టెస్టులు... అనవసరంగా మనీ వేస్ట్‌ చేయడమెందుకండీ. వచ్చే వారం ఒక్కసారి కన్పించండి.’’ చెప్పేసాడు హరి.

Preview download free pdf of this Telugu book is available at Meghana