-
-
మీరు... అమ్మా నాన్న కాగలరు...!
Meeru Amma Nanna Kagalaru
Author: Dr. Yakkati Sudhakar Babu
Publisher: Sree Madhulatha Publications
Pages: 148Language: Telugu
మనం చాలా చిరుసమస్యలు అనుకొనేవి కొందరి ప్రాణాలని తీసేస్తున్నాయి. పెదవులు నల్లగా ఉన్నాయని ఓ టీనేజి అమ్మాయిని క్లాసులో మగపిల్లలు 'సిగిరెట్లు తాగుతుందేమో' అని కామెంట్ చేసారట. ఆ మాత్రానికే సూసైడ్ ప్రయత్నించింది.కడుపు నొప్పి తీవ్రంగా వస్తుందని, అమ్మానాన్న పట్టించుకోవట్లేదని పైగా కాలేజి మానేయడానికి వంకలు పెడుతున్నాడని అనుమానించారని ఓ కాలేజి కుర్రాడు విషం తాగేశాడు.
నా క్లినిక్‌లో ఎంతో మంది పేషెంట్లని చూశాను. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా మారిపోయారు. వ్యాధులే కాక వారి కుటుంబ సమస్యలు చర్చించే వారు. నా సలహా తీసుకునేవారు. మానసిక భాధలకి కౌన్సిలింగ్ తీసుకొనేవారు, ఇప్పించేవారు. డా. సుధాకర్ కాస్తా సుధాకర్ 'బాబా' లా మారిపోయాడు. దానిలో భాగంగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెచ్చాను. ఇందులో దాంపత్య సమస్యలు - సంతాన లోపం, గర్భిణీ స్త్రీ సమస్యలు - చికిత్సలు, నవజాత శిశువు ఆరోగ్యం ఆహారం ఇలా ఎన్నో విషయాల గురించి సాధికారముగా వివరించబడినది.
- డా. యక్కటి సుధాకర్ బాబు
