-
-
మీ ఇష్టం
Mee Ishtam
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 84Language: Telugu
మీ ఇష్టం పూర్తి చేయడానికి ముందు..ఉపసంహారం ప్రారంభిస్తూ.... అప్పుడు చూసాను. మంచుపొర వెనుక ఓ దివ్య తేజస్సును... ఎన్నో నిద్రలేని రాత్రిళ్ళను చూసిన నా కనులకు భ్రమా? వాస్తవమా? భ్రమలాంటి వాస్తవమా? ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు.
ఆ దివ్యతేజస్సు నాతోపాటు లోపలికి వచ్చింది. తలుపు వాటంతటవే మూసుకున్నాయి. గదిలోని లైటు క్రమక్రమంగా అంతర్ధానమవుతోంది. లైటు వెలుతురు స్థానంలో దివ్యతేజస్సు కిరణాలు...
‘‘ఎవరూ?’’
‘‘నేను దేవుడ్ని...’’
‘‘దేవుడా?
నువ్వు... నువ్వున్నావా?’’
నా అనాలోచిత ప్రశ్న...
ఆ తర్వాత..?
దేవుడికి రచయితకు మధ్య ఏం జరిగింది?
ఈ ప్రపంచంలో ఎవరిష్టం వచ్చినట్టు వారు బ్రతకొచ్చు...ఒకరి ఇష్టం మరొకరికి నష్టం చేయనంత వరకు?
ఇష్టాన్ని చంపుకుని బ్రతుకుతున్నారా? మీ ఇష్టంతో బ్రతుకుతున్నారా? అనే విషయాలు ఆలోచించాలి.
లివింగ్ టు గెదర్ మీ ఇష్టమే...కానీ...
ఇలా ఇష్టాలు ఎన్నో...అందులో ఏ ఇష్టాలు మంచివో తెలుసుకోవడమే మీ ఇష్టం ...
ప్రముఖరచయిత విజయార్కె ...మీ ఇష్టం చదివి మీ ఇష్టమొచ్చినట్టు బ్రతికేయండి.
- మేన్ రోబో పబ్లికేషన్స్
ఒక రచయిత పుస్తకాన్ని పాఠకుల దగ్గరికి,పాఠకుల మనస్సులోకి మస్తిష్కంలోకి చేర్చడానికి కంటిచెమ్మను సృష్టించడానికి,ఆలోచనలను రేకెత్తించడానికి, పడే తపన శ్రమ ఇష్టం" మీ ఇష్టం " లో కనిపించి పాఠకులను ఇష్టపడేలా చేసింది.
మీ ఇష్టం నా చదివాక మన ఇష్టం ఎలా ఉండాలో తెలిసింది.మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి పుస్తకం తరువాత నాకు బాగా నచ్చిన పుస్తకం, " మీ ఇష్టం "
" మీ ఇష్టం పూర్తి చేయడానికి ముందు..ఉపసంహారం ప్రారంభిస్తూ.... అప్పుడు చూసాను. మంచుపొర వెనుక ఓ దివ్య తేజస్సును... ఎన్నో నిద్రలేని రాత్రిళ్ళను చూసిన నా కనులకు భ్రమా? వాస్తవమా? భ్రమలాంటి వాస్తవమా? ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు.
ఆ దివ్యతేజస్సు నాతోపాటు లోపలికి వచ్చింది. తలుపు వాటంతటవే మూసుకున్నాయి. గదిలోని లైటు క్రమక్రమంగా అంతర్ధానమవుతోంది. లైటు వెలుతురు స్థానంలో దివ్యతేజస్సు కిరణాలు...
‘‘ఎవరూ?’’
‘‘నేను దేవుడ్ని...’’
‘‘దేవుడా?
నువ్వు... నువ్వున్నావా?’’
నా అనాలోచిత ప్రశ్న...
ఆ తర్వాత..?
దేవుడికి రచయితకు మధ్య ఏం జరిగింది?"
ఈ వాక్యాలు పాఠకులను వెంటాడుతాయి.మన ఇష్టాన్ని అన్వేషించమని చెబుతాయి.
ఈ పుస్తకాన్ని ఎంతో ఇష్టంతో మూడుసార్లు చదివాను.చదివి నిజమైన సంతృప్తిని ఇచ్చే ఇష్టమేమిటో తెలుసుకున్నాను.మనల్ని మనం స్కాన్ చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుంది,
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి,అసంతృప్తిని జయించండి..ఈ పుస్తకాల తరువాత మళ్ళీ ఇష్టంగా చదివిన పుస్తకం .