-
-
మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి 4 సూత్రాలు
Mee Gnaapaka Saktini Penchukovadaniki 4 Sootralu
Author: Ranzith Kumar Nukathoti
Publisher: Durgabhavani Publications
Pages: 164Language: Telugu
జ్ఞాపకశక్తి అంటే ఏమిటో మీకు తెలుసా? జ్ఞాపకశక్తికి నిర్వచనం ఏమిటి? మీ జ్ఞాపకశక్తి బలంగా వుందా, బలహీనంగా వుందా ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? జ్ఞాపకశక్తి వారసత్వపు లక్షణమా? బలహీనంగా వున్న జ్ఞాపకశక్తిని బలోపేతం చేసుకోవచ్ఛా? కొన్ని విషయాలు ఎక్కువకాలం గుర్తుంటాయి, కొన్ని విషయాలు తక్కువకాలం గుర్తు వుంటాయి ఎందుకు? ఎక్కువగా చదివితే పిచ్చివాళ్ళం అవుతామా? ఒక సాధారణమైన ఆలోచన జ్ఞాపక శక్తిగా ఎలా మారుతుంది? అవసరం అనుకున్న విషయాన్ని జ్ఞాపకశక్తిగా మార్చుకోవచ్చా? కొన్నిటిని ఒక్కసారి చూడగానే లేదా వినగానే గుర్తు వుంటుంది. మరి కొన్నిటిని ఎంత చదివినా గుర్తు వుండదు ఎందుకు? పుస్తకంతీసి చదువుదాం కదా అని ప్రయత్నిస్తే ఆవలింతలు రావడం, నిద్రరావడం,మనస్సుని బద్దకం, మత్తు ఆవహించడం మొదలౌతుంది కారణం ఏంటి?
జీవితంలో ఏది సాధించాలన్నా ‘జ్ఞాపకశక్తి’ కీలకపాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి అంటే ప్రతి విషయం గుర్తుండాలనే అపోహ చాలామందిలో వుంది కాని అది తప్పు. ఎంత పెద్ద మేధావికి అయినా అన్ని విషయాలు గుర్తు పెట్టుకోలేరు. నిజానికి జ్ఞాపకశక్తి అంటే గుర్తుకి తెచ్చుకోవడం అని అందరికీ తెలుసు కాని విద్యార్థులకి కావల్సింది చదివింది గుర్తుకు తెచ్చుకోగల్గిన జ్ఞాపకశక్తి కావాలి. ఉదాహరణకి మీరొక సినిమాని ఒకసారి చూసి ఇంకొకరికి మొదటినుంచి చివరి వరకు చెప్పగలరు. విద్యార్థులకి ఇలాంటి జ్ఞాపకశక్తి వల్ల ఎటువంటి ఉపయోగం వుండదు. విద్యార్థికి చదివింది ఎక్కువకాలం గుర్తుండే జ్ఞాపకశక్తి కావాలి. ఇలాంటి దృఢమైన, బలమైన జ్ఞాపకశక్తి పొందాలంటే ఏమి చేయాలి?
జ్ఞాపకశక్తి ఎవరిలోనైనా "1. ప్రాక్టీస్ డెన్సిటీ ప్రిన్సిపుల్ 2. ఎమోషనల్ ప్రిన్సిపుల్ 3. ఎమోషనల్ ప్రాక్టీస్ డెన్సిటీ ప్రిన్సిపుల్ 4. స్కానింగ్`హోల్డింగ్ మెధడ్" అనే సూత్రాలపైన పనిచేస్తుంది. ఈ సూత్రాలని ఉపయోగించి కావలసిన జ్ఞాపకశక్తిని అవసరమైన మేరకి తమకి తామే పెంచుకోవచ్చు. వీటి గురించి పూర్తిగా తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే దృఢమైన జ్ఞాపకశక్తి మీ సొంతం అవుతుంది.
గమనిక:
“మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి 4 సూత్రాలు” ప్రింటు పుస్తకంతోపాటు ఒక DVDని ఉచితంగా ఇస్తున్నారు. ఈ DVDలో మీరు ఊహించిన మీ మనస్సు గ్రాఫిక్స్‌లో చూపబడుతుంది.
Free pdf preview is not working for this book. Can you please reply with link to my email id: bablusam217@gmail.com
Is this having a rent option????