-
-
మెదడుకు పదును - స్టూడెంట్ లెటర్ రైటింగ్
Medaduku Padunu Student Letter Writing
Author: Akshara and Saraswati
Publisher: Saraswati Publication
Pages: 101Language: Telugu, English
Description
మెదడుకు పదును
• మే లో కొనే సాక్స్ని తెలుగులో ఏమంటారు?
మేజోళ్ళు.
• ఈత రాకుండ బావిలో పడ్డవారు ముందు ఏం చేస్తారు?
తడుస్తారు.
• నిప్పు తగిలితే కరిగిపోయే డాక్టర్ ఎవరు?
ప్లాస్టిక్ సర్జన్.
• కొంగ ఒంటికాలిపైనే నిలబడుతుంది ఎందుకని?
రెండు కాళ్ళు ఎత్తితే పడిపోతుంది కనుక.
• స్ట్రాతో త్రాగే టీ పేరేమిటి?
ఫ్రూటీ.
• ప్రపంచ వెయిట్ లిఫ్టర్ ఓసారి సన్నని ఇనుపరాడ్ని ఎత్తలేను అన్నాడు. ఎందుకని?
అప్పుడా రాడ్ ఎర్రగా కాలి వుంది కనుక.
****
స్టూడెంట్ లెటర్ రైటింగ్
ఉత్తరాలు రాయడం అనేది మన నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఉత్తరాలు తరచుగా రాయడం వల్ల మనకు భాష కూడా అభివృద్ధి చెందుతుంది. చక్కని ఉత్తరం రాయడం కూడా ఒక కళే ! నెహ్రూగారు ఇందిరాగాంధీకి రాసిన “Letters to my daughter” ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఉత్తరాల పుస్తకం.ఇంగ్లీషులో ఉత్తరాలు రాయాలంటే చాలామంది బెదురుతారు. కారణం ఇంగ్లీషు మనకు కొత్త కనుక! విద్యార్ధులు ముఖ్యంగా ఇంగ్లీషులో ఉత్తరాలు ప్రతిభావంతంగా రాయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు చక్కని భాషా పరిజ్ఞానాన్ని సంపాదించుకోగల్గుతారనేది ఖచ్చితం.
అందుకే ఈ పుస్తకంలో వందకు పైగా వివిధ విషయాలు, వివిధ సందర్భాలలో రాసే ఉత్తరాలు ఇంగ్లీషులో యివ్వడం జరిగింది.
Preview download free pdf of this Telugu, English book is available at Medaduku Padunu Student Letter Writing
Login to add a comment
Subscribe to latest comments
