-
-
మాయావి
Mayavi
Author: Adapa Chiranjeevi
Publisher: Sri Krishnadevaraya Publications
Pages: 92Language: Telugu
Description
మారుతీ బ్యాంక్ స్ట్రాంగ్‌రూమ్‌లో ప్రత్యక్షమైంది ఒక అస్థిపంజరం. దాని కుడిచేతిలో నల్లగా నిగనిగలాడుతున్న ఓ బ్రీఫ్‌కేస్ ఉన్నది. అది పట్టుకుని ఠీవిగా ముందుకు నడిచిందా అస్థిపంజరం. కాస్త ముందుకు వెళ్ళి ఆగి, తల పైకెత్తి చూసింది. దాని కళ్లల్లో అగ్నిగోళాలు కదలాడుతున్నాయి.
అస్థిపంజరం రౌద్రంగా చూసేసరికి, రెండు సి.సి. కెమేరాలు భగ్గున మండిపోయాయి.
బ్యాంకులో దొంగులు పడ్డారని బ్యాంక్ అధికారులే చెబుతున్నారు. కానీ, వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. కరెన్సీ కట్టలు చెక్కు చెదరలేదు. సొమ్ములు భద్రంగా ఉన్నాయి!
అంతా మాయ!
దీని వెనుక దాగిన రహస్యం ఏమిటి?
చిత్రమైన ఈ మాయ వెనుక దాగి ఉన్న మాయావి ఎవరు?
సస్పెన్స్ గుర్రాలను...
మెరుపు వేగంతో పరుగు తీయించే
అడపా చిరంజీవి సరికొత్త రచన!
మాయావి
Preview download free pdf of this Telugu book is available at Mayavi
డిటెక్టివ్ సాహిత్యంలో అడపా చిరంజీవి గారి రచనా శైలి విభిన్నం.
గాలిబంగ్లా లాంటి ( జ్యోతిచిత్ర పత్రిక నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన ) నవల రాసిన తన కలం నుంచి వచ్చిన " మాయావి " ఆసక్తిని రేకెత్తించడంలో పరుగులు తీయించింది.
డిటెక్టివ్ రంగపాణి పరిశోధన , దెయ్యాల గురించి అన్వేషణ,అడుగడుగునా ఉత్కంఠ రేపే అక్షరాల సమ్మోహనం,
డిటెక్టివ్ నవలలు రాసే రచయితలు అతికొద్దిమంది మాత్రమే,వారిలో చాలా మంది రచయితలు డిటెక్టివ్ నవలలు రాయడం మానేశారు.
ఈ సమయంలో మాయావి లాంటి నవల ఆ లోటును తీర్చింది.చదివించే కథనం,అడుగడుగునా సస్పెన్స్ పాఠకులను ఆహ్లాదాల ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది
మాయావి నవల చదవడం పూర్తీ అయింది. దొంగ నోట్ల మీద రాసిన ఈ నవల మన ఆర్ధిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందో చాలా చక్కగా చెప్పారు.కవర్ పేజీ మీద ఆస్థి పంజరం బొమ్మ చూసి ఇదేదో దెయ్యాల నవలేమో అనుకున్నా కానీ మంచి థ్రిల్లర్ అని తర్వాత తెలిసింది.చదవడం స్టార్ట్ చేస్తే నవల పూర్తీ అయ్యేవరకు వదిలిపెట్టము. ఏవో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అంటే సినిమాటిక్ సీన్లు..ఇది సినిమా తీయడానికి అన్ని విధాలా కరెక్ట్ నవల.
మాయావి నవల టైటిల్ చాలా బావుంది.description చదివాక ఈ నవల తప్పకుండా చదవాలనిపించింది. ఈ నవల ను సండే డౌన్ లోడ్ చేసుకుని చదవాలనుకుంటున్నాను.చదివాక ఈ నవల ఎలా వుందో చెబుతాను. అడపా చిరంజీవి గారి నవలలు చాలా బావుంటాయి.ఇదికూడా బాగా ఉంటుందని ఊహిస్తున్నాను.వీరి పులి మీద పుట్ర నవల కూడా చదివాను. చాలా బావుంది.
A very intelligent novel on Indian economy... thrill readers, good storyline and dialogue, lots of action and drama. The author has a great imagination In the world of crime and detective fiction...
very interesting story