-
-
మాయాబజార్ - సినిమా నవల
Mayabazar Cinema Navala
Author: Raavi Kondala Rao
Publisher: R.K.Books
Pages: 128Language: Telugu
విజయా ప్రొడక్షన్స్ వారు. అతి భారీగా నిర్మించిన “మాయాబజార్” చిత్రం 27-3-1957న విడుదలైంది. ఎంతో ఆశగా, ఆత్రుతగా ఎదురు చూసిన ప్రేక్షకులకు ”మాయాబజార్” షడ్రసోపేతమైన ’వివాహ భోజనంబు’ను వడ్డించింది! పండితులు, పామరులు, ముఖ్యంగా పిల్లలూ, సర్వజనమూ ఈ చిత్రం చూసి ఆనందించి, అభినందించారు. నాటి నుంచి నేటివరకు ’మాయాబజార్’ ఎప్పుడు విడుదలైనా ఎక్కడ విడుదలైనా (వీడియోలు వచ్చినా) నాటితరం ప్రేక్షకులు, నేటితరం ప్రేక్షకులూ విశేషంగా వెళ్ళి చూస్తూనే వున్నారు. ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు ఈ చిత్రం ’విజయ’ ఢంకా మోగిస్తూనే వుంటుంది. కథా కల్పనకూ, స్క్రీన్ ప్లేకీ సంభాషణలకూ, సంగీతానికీ ’మాయాబజార్’ పెట్టింది పేరు. చిత్రంలోని సంభాషణలను, పాటలు పాడుకున్నట్టుగా ప్రజ చెప్పుకుంటూనే వుంటుంది. ఇంతటి సమగ్రమైన స్క్రిప్టు, సంభాషణలనూ పుస్తకరూపంలో అందిస్తే, ’మాయాబజార్’ అభిమానులందరూ ఎంతో ఆనందిస్తారన్న సంకల్పంతో పాటలు, మాటలతో నవలారూపంలో పూర్తిగా పొందుపరుస్తున్నాము.
50 సంవత్సరాలైనా ఇంకా విజయం సాధిస్తున్న చిత్రం ఇంకొకటి కనిపించదు!
గమనిక: "మాయాబజార్ - సినిమా నవల" ఈబుక్ సైజు 13.3mb