-
-
మాయ గుర్రం మేటి గుర్రం
Maya Gurram Meti Gurram
Author: Manchi Pustakam
Publisher: Manchi Pustakam
Pages: 52Language: Telugu
ఈ పిల్లల బొమ్మల పుస్తకంలో రెండు రష్యన్ జానపద కథలు ఉన్నాయి. మొదటి కథ పేరు మాయ గుర్రం మేటి గుర్రం. రెండవ కథ మత్స్య మిత్రుడి మంత్ర మహిమ
మాయ గుర్రం కథని తిరిగి చెప్పిన వారు ఎమ్. బులాతొవ్. టి. మావ్రిన దానికి తగినట్లుగా అందమైన బొమ్మలు గీసారు. ఈ కథకి ఇంగ్లీషులో చెస్ట్నట్ గ్రే అని పేరు. అందరూ వెర్రివాడనుకునే కుర్రాడు రాజుగారి అల్లుడయ్యేలా చేస్తుంది ఓ మాయగుర్రం. ఆసక్తికరమైన కథ
మత్స్య మిత్రుడి మంత్ర మహిమ కథని తిరిగి చెప్పిన వారు ఎమ్. బులాతొవ్. టి. మావ్రిన దానికి తగినట్లుగా అందమైన బొమ్మలు గీసారు. ఉప్పల లక్ష్మణరావు తెలుగులోకి అనువదించారు. ఈ కథకి ఇంగ్లీషులో ది విల్ ఆఫ్ పైక్ అని పేరు. అందరూ వెర్రివాడనుకునే కుర్రాడిని రాజుగారి కూతురు పెళ్ళిచేసుకునేలా చేస్తుంది ఓ చేప ఈ కథలో.
ఈ కథలకి అద్భుతమైన వర్ణమిశ్రమంతో వేసిన అందమైన బొమ్మలని చూస్తుంటే పిల్లలే కాకుండా పెద్దలు సైతం మైమరిచిపోతారు. ఆలస్యం ఎందుకు? చదవండి ఇక....
