-
-
మాయ
Maya
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 270Language: Telugu
మేడమీది డ్రాయింగ్ రూమ్ కి ఎడంగా ఉన్న ఒక గదిలో ప్రశాంత చిత్తంతో ధ్యానముద్రలో ఉన్నాడు కపిధ్వజుడు. పక్కన పడుంది కోతిబొమ్మ. ఆ సమయంలో ఆ మహాయోగి అంతరంగంలో ఏదో చిన్న అలజడి. ఆయన కర్ణేంద్రియాలకు సుదూర ప్రాంతంలో ఎక్కడో ఉన్న గురుదేవుల పలుకులు ఏవో ఆజ్ఞాపిస్తున్నాయి. ఉలికిపడి కళ్ళు తెరిచాడాయన.
అలౌకికానందంలో ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే ఆ మహనీయుని ముఖంలో ఇప్పుడు ఆందోళనఛాయలు కన్పిస్తున్నాయి. క్షణం కూడ ఆలస్యం చేయకుండా లేచి పాదుకలు ధరించి త్రిశూలం అందుకున్నాడు. గదిలోంచి బయటకొచ్చి టెర్రస్ మెట్లవైపు దారితీశాడు.
ఆయన నడుస్తుంటే పాదుకలు చేస్తున్న చప్పుడు తప్ప అంతటా నిశ్శబ్దంగా ఉంది. వాతావరణం మసక చీకటిగా మారి ఈదురుగాలి వీస్తోంది.
ఆయన టెర్రస్ మీదకు చేరుకునేసరికి ఆకాశం చాలా వేగంగా కారుమబ్బులతో నిండిపోయింది. ప్రళయం ముంచుకురానుందా అని భయపెట్టేంత వేగంగా మబ్బులు చిక్కగా ముసురుకుంటున్నాయి.
టెర్రస్ మధ్యలో కొచ్చి నిలబడి ఎర్రబారిన కళ్ళతో ఆకాశం వంక ఉరిమి చూశాడు. ఆ క్షణంలో పరమశివుని ప్రతిరూపంలా గోచరిస్తున్నాడాయన.
Please enable rent option for this novel.
its ver nice and intresting
good for time pass