-
-
మట్టితాళ్ళ వల
Mattitalla Vala
Author: Siramsetty Kantharao
Publisher: Sri Vedagiri Communications
Language: Telugu
మాగ్జిం గోర్కీ - రష్యన్ భాషలో అభ్యుదయ ప్రధాన రచనలు చేస్తున్నవాళ్ళందర్నీ సాహితీ లోకానికి పరిచయం చేసేవాడు. వారిలో అంటన్ చెహోవ్ గురించి ఎంతో హృద్యమైన మాటలన్నాడు:
"No one before him has painted with such merciless truthfulness, the inglorious and bleak picture of people's life"
మన మాతృభాషలో అంతటి అభినందనలందుకోదగిన కథకుల కోసం నేనెప్పుడూ అన్వేషిస్తూంటాను.
దాదాపు ఒక దశకం కింద తెలుగు సాహిత్యాకాశంలో, హఠాత్తుగా, ముందుగా ఏ సంకేతం ఇవ్వకుండా - 'హేలీ' ధూమకేతువు లాంటి, అత్యంత ప్రకాశవంతమైన రచనా ప్రతిభతో - ఈ శిరంశెట్టి కాంతారావు సాక్షాత్కరించాడు.
ఇంత నిజాయితీతో, కన్నతల్లి కడుపుతీపి లాంటి సానుభూతితో దీనుల, బలహీనుల చరిత్రల్ని రికార్డు చేసిన కథకుల కూటమిలో అతనిదొక అరుణపతాక, భగభగమండే కాగడా.
అతని వాక్యనిర్మాణంలో అలవోకగా చొచ్చుకువచ్చే సిమిలీలు, మెటాఫర్లు - ఒక్క విశ్వనాధ కవి సామ్రాట్టుకే చెల్లు.
ఆకలి స్వరూపం, దరిద్ర దావానలపు అవమానం - అనుభవైక వేద్యంగా, భూమిపుత్రులతో అరణ్య గిరిజన వారసులతో, అతనికున్న సహజ సంపర్కంతో ఈ కథానికలు విస్ఫోటనాలుగా వెలుగు చూస్తున్నాయి.
వ్యవసాయరంగ కూలీగా, పారిశ్రమికరంగ శ్రామికుడిగా - ఎంతో నిబద్ధతతో కాంతారావు సృష్టించిన ఈ సాహిత్యం - అత్యంత వాస్తవిక చిత్రణలో మేలిరకపు జరీకండువాలు.
- మునిపల్లె రాజు
