-
-
మట్టి వేదం
Matti Vedam
Author: Varanasi Bhanumurthy Rao
Publisher: Thapasvi Manoharam Publications
Pages: 129Language: Telugu
సమాజాన్ని నిశితంగా పరిశీలించిన భానుమూర్తి గారు, సమాజంలోని పలు అంశాలను కవితా వస్తువులుగా తీసుకొని కవిత్వీకరించడానికి తన శాయశక్తులా కృషి చేశారు.
ఒక కవి సాధన క్రమంలో వస్తువు - లోలోతుల్లోకి పోయి అంతర్గత నివృత్తిలో నీటి పిట్టలా పైకి తేలుతాడు. కవి అనుభవించినదంతా మనం అనుభవించలేక పోవచ్చు. కానీ మనదయిన నిర్మాణం జరగడానికి, ఆ కవి- ఆ కవిత ఉపయోగ పడతాయి. ఒక వస్తువు మీద కవిత ఎత్తుకంటే ఆ వస్తువు విశ్లేషణ ఒక conclusion కి drive చేసే దిశగా సాగుతుంది.
సమాజం పట్ల, కవిత్వం పట్ల ఎంతో ఆసక్తి, శ్రద్ధ కనబరుస్తున్న భానుమూర్తిగారు జీవితానికున్న అన్ని కోణాలను అధ్యయనం చెయ్యడంలో మరింత ముందడుగు వేస్తూ, కవితా నిర్మాణంలోని మెళుకువలను, ఎత్తుగడలను, శిల్పం, అభివ్యక్తి లాంటి విషయాల పట్ల సంపూర్ణమైన పరిశీలనలను చేస్తూ మరిన్ని ఉత్తమ కవితలతో ఈ సాహిత్య రంగంలో ముందడుగు వేస్తారని ఆశిస్తూ, అద్భుతమైన 'మట్టి వేదం' శీర్షికతో వెలుగు లోకి తెచ్చిన భానుమూర్తి గారికి హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
- కెరె జగదీష్
