• Mattakokila
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మత్తకోకిల

    Mattakokila

    Author:

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు కవిత్వంలో నేడు నిలబడింది, నిలబడుతున్నది, భావ ప్రకటనకు ఛందస్సు సంకెళ్ళులేని స్వేచ్ఛనిచ్చేది, అభివ్యక్తికి ఆకాశమంత అవకాశాన్నిచ్చేది కేవలం వచన కవిత్వమే అన్నది నా నమ్మకం. వాహెద్ అద్భుతమైన వచనకవితలు రాశాడు. బహుశా ఉర్దూ ప్రభావం కావచ్చు వాహెద్ గజల్ రచనల పట్ల కూడా తన అభినివేశాన్ని వదులుకోలేదు. ఈ సంపుటిలో అద్భుతమైన అభివ్యక్తి, చమత్కారం, తళుక్కుమని మెరిసే కవిత్వాంశతో కూడిన అనేక గజళ్ళున్నాయి.

మత్తకోకిల పద్యవిశేషం. ఛందోబందోబస్తులతో రాసిన గజళ్ళ సంపుటికి ఒక పద్యం పేరు పెట్టడమే కాదు, ఈ పుస్తకం చివరన చారుకేశి అని చేర్చిన బుక్ లెట్ కి పెట్టిన పేరు కూడా విశేషమైనదే. సంగీతంలో చారుకేశి ఒక రాగం పేరు. సంగీత సాహిత్యాల సమ్మేళనం గజల్ అని చెప్పకనే చెప్పాడు.

- కవి యాకూబ్

గమనిక: " మత్తకోకిల " ఈబుక్ సైజు 6mb

Preview download free pdf of this Telugu book is available at Mattakokila
Comment(s) ...

’’మత్తకోకిల‘‘ గజల్ పుస్తకం ఈ బుక్ రూపంలో అద్భుతంగా ప్రచురించిన ’’కినిగె.కాం‘‘కు ధన్యవాదాలు. దాశరథి, సి.నారాయణరెడ్డి వంటి కవులు తెలుగులో గజల్ సాహిత్యానికి పునాదులేశారు. ’’బిందువులో సింధువును కుదించడమే గజల్‘‘. సాంద్రత, క్లుప్తత, అభివ్యక్తి ప్రత్యేకతల రిత్యా విశిష్టమైన కవిత్వ ప్రక్రియ గజల్. మత్తకోకిల ఈ బుక్ పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను. థాంక్యు కినిగె.