-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
మాతృవందనం (free)
Matruvandanam - free
Author: Vedavyasa
Publisher: Jayanthi Charitable Trust
Pages: 26Language: Telugu
వేదవ్యాసుని ''వాయుపురాణం''లోని 16 శ్లోకాలకు 'బ్రహ్మశ్రీ' చాగంటి కోటేశ్వరరావు గారి వ్యాఖ్యానం ఈ చిన్న పుస్తకం.
* * *
''అమ్మ'' - పరిచయమక్కరలేని ఏకైక వ్యక్తి, పదం. సృష్టికర్తగా, స్థితి కర్తగా, ప్రళయ కర్తగా (నిద్రపుచ్చుతోంది కనుక) ఆమె పరబ్రహ్మ స్వరూపిణి, పితృఋణాన్ని తీర్చుకోవచ్చు కానీ, మాతృ ఋణం తీర్చుకోవడం సాధ్యం కాదని శాస్త్రవాక్కు.
''అమ్మ'' - ఓదార్పు, ధైర్యం, అప్యాయత, ప్రేమ మరియు ఆశీస్సుల కలబోత. అట్టి అమ్మతనానికి శ్లోకరూప పట్టాభిషేకమే ''మాతృషోడశి''. ప్రతి శ్లోకానికి ''బాపు''గారు గీసిన బొమ్మలు మనసుని ఆర్ద్రతతో నింపేస్తాయి.
ఈ శ్లోకాలను హృద్యమైన తాత్పర్యంతో, బాపుగారి బొమ్మలతో, నా వ్యాఖ్యానంతో గ్రంథరూపంలో తేవడానికి శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న యీ ప్రయత్నం పరమ సంతోషదాయకం. శ్రీ వరప్రసాద్ గారు సహజంగా మాతృ, పితృ భక్తి పరాయణులు.
ఈ పుస్తకాన్ని చదవడం, సంస్కారాన్ని పెంచి, మనిషి - మనిషిగా బ్రతకటానికి మార్గం సుగమం చేస్తుందనడం నిస్సందేహం.
- చాగంటి కోటేశ్వర శర్మ
* * *
అమ్మ గురించి భారతీయ ఆర్షధర్మం ఎంత అద్భుతంగా చెప్పిందో... అమ్మ గురించి బాపుగారూ అంత గొప్పగానే బొమ్మ కట్టారు! వాయుపురాణాంతర్గత శ్లోకాలకి ఆయన గీసిన బొమ్మలు కుంచెతోగాక.... హృదయంతో గీసినట్టున్నాయ్.
... మనకి గోరుముద్దలు తినిపించిన కన్నతల్లికి మనం పిండ ప్రదానం ఎందుకు చెయ్యాలి అన్న సంగతిని గుండెని పిండేలా... చిత్రించారు!
ఈ అమ్మ బొమ్మల పుస్తకాన్ని కళ్లు తడవకుండ తిప్పడం అసాధ్యం (మానవాతీతులకు తప్ప...)
ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన వరప్రసాద్ గారి మాతృమూర్తి శాంతమ్మగారు పుణ్యాత్మురాలు....! వరప్రసాద్ ధన్యులు.
- తనికెళ్ల భరణి
