• Matrubhasha Teluguku Velugu Chupu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • మాతృభాష తెలుగుకు వెలుగు చూపు

  Matrubhasha Teluguku Velugu Chupu

  Pages: 80
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

భాష ప్రాణమైతే లిపి శరీరం లాంటిది. శరీరం వినా ప్రాణానికి మనుగడ వుండదు. శరీరం లాంటి ఆ లిపి క్రీ.పూ. 3వ శతాబ్ధంలో తొలి తెలుగు శాసనం లభించడంతో మన భాష ప్రాచీనత సంతరించుకొని ప్రభుత్వం చేత గుర్తింపుకు నోచుకొంది. ఈ ప్రస్తకాన్ని ఆసాంతం చదివితే సర్వాంగ సుందరమైన మన తెలుగు భాష ఇంత గొప్పదా! అని ప్రతి ఆంధ్రూడూ గర్విస్తూ తన్మయత్వం జెందుతాడు. ఈ పుస్తకాన్ని ప్రభుత్వం చదివితే - ప్రపంచ భాషలన్నింటిలో స్వరయుక్తమైన భాషగా ద్వితీయ స్థానం సంపాదించి గణుతి కెక్కిన మన మాతృభాషను ఇంత నిర్లక్ష్యం చేస్తున్నామా! అని ప్రభుత్వం కుమిలి కుమిలి కుంచించుకుపోతుంది. శిరపింఛ సాదృశ్యమైన తల కట్టుతో, చంద్రంబింబ సమానమైన వలయాకారంతో ఠీవిగా నిలబడే అక్షర సముదాయం గల ఏకైక భాష మన తెలుగు భాష ఒక్కటే. అల్లాంటి ఘనకీర్తి గల్గిన భాషామ తల్లి నేను చిక్కశల్యమైన కుక్కి మంచాన అనాదరంగా పడి వుంది. ఈ తల్లి ఆరోగ్యవంతం చేయడానికి సభలూ, సమావేశాలూ , జరపడం కాలక్షేపం మాత్రమే. దేశ విదేశ సంస్థలన్నీ ఏకత్రితమై ప్రభుత్వాన్ని తట్టి లేపాలి. భాషా వికాసానికి నిర్దష్టమైన ప్రణాళిక సూచించాలి. పోరాట పఠిమతో ఉద్యమించాలి. మిత్రులు క్రిష్ణయ్య గారు ఎంతో శ్రమించి, పరిశోధించి, భాషాపరమైన అనేకానేక విషయాలతో పూర్ణకుంభాన్ని మన సమాజం ముందుంచారు. ఇది అన్ని తరాల వారి అనుమానాలకు సంశయ నివృత్తి జేయగలదని చెప్పనగును. తెలుగు భాషకు వెలుగు జూపే ప్రయత్నం ప్రభుత్వమే చేయాలి. అదే ప్రాధమిక దశ నుండీ "సిలబస్" సరిజేసుకోవడం.

- రాజా శివానంద

నిత్య సత్య పరిశీలకులు, విషయ సుస్పష్టవ్యక్త నిపుణ శిల్పి శ్రీ కేకలతూరి క్రిష్ణయ్య గారు రచించిన పదిహేడును పరిశోధనా గ్రంథములే. అవి విభిన్న విపుల విషయ సిరులు. విశిష్ట విషయ సంగ్రహణా నిధులు. విశ్వజన ప్రయోజనకరములు. సందేశాత్మకములు, ప్రౌఢభావోన్నతములు. ఇట్టి సమాజ హితవరి రచించిన ఈ గ్రంథము సామాన్యులకు పండితులకు భాష, మాతృభాష, తెలుగు భాషల పట్ల చక్కని అవగాహన గల్గించును. మానవ మనుగడ కత్యంతావశ్యకమగు భాష లెప్పుడెక్కడెట్లు పుట్టెనో, వ్యాపించెనో తెల్పును. ఐత్రేయారణక్యయజుర్వేద సూక్తములను, సాన్, పపువాన్, టిబెట్ బర్మన్, ఆస్ట్రో ఆసియాటిక్ ఇండో యూరోపియన్ మొదలగు భాషల చరిత్రను తెల్పును. సంస్కృతిని వివరించును.వ్యాప్తి నెఱిగించును. మానవుని సర్వతోముఖాభివృద్ధికి మాతృభాష దోహదపడు విధమును ప్రపంచమున మాతృభాషాభివృద్ధి దేశములలో పెరిగిన విజ్ఞాన శాస్త్ర సాంకేతిక నైపుణ్యము. తద్వారా ఆయా దేశముల సాంఘిక, ఆర్థిక, యశోప్రగతులను సోదాహరణముగా యిందు తెలుపబడినది అని పఠితుల హృదయమున మాతృ భాషాభిమాన బీజములను విత్తును. తెలుగు భాష పుట్టు పూర్వోత్తరములు, ఎవ్వరూ గతములో చెప్పని రీతిలో రచయిత ఈ గ్రంథమున వినూత్నముగ తెలిపెను. అచ్చులు, హల్లులు, వ్యాకరణాంశములు, జరిగిన మార్పులు క్రమపద్ధతిలో తెల్పెను.

- చలంకోట బురుజు మునస్వామి

Preview download free pdf of this Telugu book is available at Matrubhasha Teluguku Velugu Chupu