• Matladavalisindi Sramika Varga Astitvam Gurinche
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాట్లాడవలిసింది, 'శ్రామికవర్గ అస్తిత్వం' గురించే!

    Matladavalisindi Sramika Varga Astitvam Gurinche

    Author:

    Pages: 102
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతీ సంవత్సరం చివరిలో, ఆ సంవత్సరంలో నేను రాసిన వ్యాసాల్ని, ఒక సంపుటంగా తీసుకు వస్తున్నాము. ఈ సంపుటం కూడా అలాంటిదే.

ఈ వ్యాసాలన్నీ పత్రికల్లో వచ్చినవే. అయినా, పాఠకులు అందరూ, ఈ వ్యాసాలు వచ్చిన వేరు వేరు పత్రికల్ని చూసి వుండక పోవచ్చు. ఈ కారణం వల్ల కూడా, ఈ విషయాల మీద ఆసక్తి వున్న పాఠకులు కొత్త పుస్తకం ద్వారా అయినా కొత్త వ్యాసాలు చదువుతారని నేను ఆశిస్తాను. దీని వల్లే పత్రికలలో వచ్చిన వాటిని కూడా పుస్తకాలుగా ఏర్పర్చడం జరుగుతూ వుంది, గతం లోనూ, ఇప్పుడూ కూడా.

నాకు రాయాలనిపించిన విషయాల్ని - అవి సమకాలీన సంఘటనలైనా, మార్క్సు సిద్ధాంతానికి సంబంధించినవైనా - వాటినే రాశాను. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా నేను రాసి వుండక పోవచ్చు. సమకాలీన విషయాల మీద స్పందించాలంటే, నిత్యమూ అనేక వందల సమస్యలకి స్పందించవలిసిందే. నేను రాయాలని గట్టిగా అనుకున్నప్పుడు కూడా తగినంత స్పష్టమైన సమాచారం లేకే కొన్నిటిని రాయలేకపోయాను.

కొన్నిటి మీద రాయాలనిపించక పోవడమూ వుంటుంది. ఇతరులు ఆ విషయాల గురించి బాగా రాసి వున్నప్పుడు, వాటిని మళ్ళీ నేను రాయడం అనవసరం అని మానివేయడం కూడా కావచ్చు.

ఈ వ్యాసాలు రాయక ముందు కంటే, రాయడం పూర్తి అయిన తర్వాత, నేను కొన్ని కొత్త విషయాల్నీ, కొత్త కోణాల్నీ, తెలుసుకోవడమూ జరుగుతూ వుంటుంది.

ఈ మధ్య నే 2, 3 నెలల క్రితం, కొత్తగా వచ్చిన నా ఇతర 2 పుస్తకాల లోనించీ కొన్ని భాగాల్ని, అవి కూడా పత్రికల్లో వచ్చినవే అయినా, వాటిని కూడా, ఈ సంపుటిలో చేర్చాను. ఎందుకంటే, ఆ పుస్తకాలు చూసి వుండని పాఠకులకు అవి తెలిసివుండాలని!

- రంగనాయకమ్మ

Preview download free pdf of this Telugu book is available at Matladavalisindi Sramika Varga Astitvam Gurinche