• Matapanjaramlo Kanya
 • Ebook Hide Help
  ₹ 108
  120
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • మతపంజరంలో కన్య

  Matapanjaramlo Kanya

  Pages: 177
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

అయాన్ హిర్సి అలి రాసిన "ది కేజ్ వర్జిన్" చదివాను. ఆమె సొమాలీలో పుట్టారు. సౌదీ అరేబియా, ఇథియోపియా, కెన్యాలో తల్లిదండ్రులతోపాటు నివశించారు. ఇస్లాంలో గట్టి నమ్మకం గల తల్లి-దండ్రులు ఆమెను ముస్లింగా పెంచారు. అల్లా, ప్రవక్త మహమద్ చెప్పినట్లుగా నడుచుకోమని వారు ఆమెకు నేర్పారు. అదేలోకంగా పెరిగినా, ఆమెలో సందేహాలు పొడచూపాయి.
ముఖ్యంగా ఇస్లాం సమాజాలలో ఆడవారి పరిస్థితి దీనంగా ఉన్నదని ఆమె గ్రహించారు. పిన్నవయసులో అమ్మాయికి ముక్కు, ముఖం తెలియని వ్యక్తితో వివాహం జరిపించి, పిల్లల్ని కనే యంత్రంగా (మగపిల్లల్ని కంటే మరీ మంచిది), ఇంటెడు చాకిరీ చేసే మనిషిగానే తన సమాజాలలో చూడటం ఆమెకు వ్యథ కలిగించింది. మతంలోని మంచిని అనుసరించటం మంచిదే అన్నారు. అది వ్యక్తిగతంగా ఉండాలన్నారు. కాని మతాన్నడ్డుపెట్టుకొని అకృత్యాలు చేస్తుంటే, మనుషులు మృగ ప్రాయంగా ప్రవర్తిస్తే సహించకూడదనేదే నేటి ఆమె పోరాట సారాంశం.
ఆడవారి పరిస్థితి అన్ని మతాలలోనూ, సమాజాలలోనూ రెండవ స్థాయిదే. కాకపోతే ఇస్లాంలో ఉన్నంత పట్టు, విడుపూ లేని స్థితిగాదు వారిది. క్రిస్టియన్లలో, హిందువుల్లో, యూదుల్లో స్త్రీది తక్కువ స్థాయే. అయినా, వారు చదువుకొని తమ స్థితిని మెరుగు పరచుకొనే అవకాశాలు వారికి లభ్యమవుతున్నాయి. గృహహింస భరిస్తున్నారు. ఉద్యోగాలలోనూ వివక్ష, ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
హిర్సి అలి పెరిగిన సమాజంలో స్త్రీలు దుస్థితిలో ఉన్నారు. చదువుకు దూరం, స్వేచ్ఛకు దూరం, బురఖాలు ధరించి ఉండి, సామాన్య జీవితం గడపలేకపోతున్నారు. ఎప్పటికీ పురుషుని చెప్పుచేతల్లో (తండ్రి, సోదరులు, భర్త, కొడుకులు) ఉండాలి. బయట ముఖం చూపకూడదు. మతాచారాలూ, సాంప్రదాయాలూ వారిని అణచి వేసే ధోరణిలో కొనసాగుతున్నాయి. ఇవన్నీ చూచిన ఆమె, స్త్రీలకు వ్యక్తిత్వం, స్వేచ్చ, విద్య కావాలని, తన రచనల ద్వారా, ఫిల్మ్, టెలివిజన్ మాధ్యమాలుగా పోరాడుతున్నారు.
హిర్సి అలి ఆలోచనలు, అభిప్రాయాలూ, మనలో చాలామందికి ఉంటాయి. కాని ఆచరణలో చూపలేం. ఆమెకు చెప్పే ధైర్యం ఉన్నది. దానివలన ఆమె ఎన్నో కష్టనష్టాలకోర్వవలసి వస్తున్నది. చంపుతామని బెదిరింపులు ఉన్నాయి. అయినా, నిర్భీతిగా చెప్పదలచింది చెపుతున్నారు.
ఆమెకిష్టంలేని పెళ్ళి తెలియని వానితో, తండ్రి కుదిర్చితే, తప్పించుకుని నెదర్లాండ్స్‌కు, తన 22వ ఏట పారిపోయి, అక్కడ ఆశ్రయం పొందారు. డిగ్రీ చదువు ముగించారు. దుబాసీగా పని చేశారు. డచ్ పార్లమెంట్ మెంబరయ్యారు. అక్కడ నుండే, ముస్లిం ఆడవారి విద్య, చైతన్యం, హక్కులు, స్వేచ్ఛ, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి అనే వాటి కొరకు పోరాడుతున్నారు. ఆమె పోరాట పటిమ నన్ను ఆకర్షించింది. ఆమె “ది కేజ్ వర్జిన్”ను “మతపంజరంలో కన్య” అనే పేరుతో తెలుగించాను. తెలుగు చదవ గలిగినవారికి ఈ అనువాదం అందుబాటులో ఉండాలని నా ఆశ.

- వెనిగళ్ళ కోమల

Preview download free pdf of this Telugu book is available at Matapanjaramlo Kanya