-
-
మాటల పందిరి
Matala Pandiri
Pages: 273Language: Telugu
జుగల్ బందీలు, జంటకవులు మనకి కొత్తకాదు. అవిభాజ్య కవలల ఆలోచనా విధానం కూడా ఒకేలా వుండదు. ఈ రెండింటికీ భిన్నంగా సార్వకాలికమైన కాలమే రాయడానికి రెండు కలాలు ఒకటై కలిసిరావడం, రాయడం అపూర్వం.
వారం వారం కాలమ్ కోసం పాఠకులు ఎదురు చూసేలా చేయడం ఆషామాషీకాదు. రాసేవారి శైలి, ముద్ర పాఠకులు కనిపెట్టగలగాలి. అలాకాకపోతే అనేక కలాలు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ కలకాలం నిలబడే కాలం రాయడానికి కాలమిస్ట్కి ఓ లిస్ట్ ఖచ్ఛితంగా తెలిసుండాలి. అది "A mind as tree as the ocean, imagination as limit less as the sky, heart as wild as the wind, and spirit as unshakable as the earth."
ఈ సునిశితత్వానికి సున్నిత హాస్యచమత్కారాలు అది 'ఆంధ్రప్రభలు' వెలిగించి, ఒకింత 'ధీర' గంభీరంగా, 'స్నేహంగా', 'ఓ చిన్నమాట' అంటూ మాటల పందిరి వేసి వ్యక్తిత్వ వికాసపు వాకిళ్ళు తెరిచారు శ్రీలక్ష్మి, జ్ఞాన ప్రసూన.
మాటల పందిరి వినూత్న, విశిష్ట, వైవిధ్య భరితమైన ఎన్నెన్నో సంగతుల సమాహారం. తరాల అంతరాలను చెరిపేసే నిరంతర 'కాల' ప్రవాహం. ఎండా వాన జట్టుగా వచ్చిన వేళ సూర్యరశ్మిలో మెరిసే వానచిలుకుల అందాల్ని చిందించే మాటల పందిరిలో మూటకట్టుకోవాల్సిన ముత్యాలు ఎన్నో! ఎన్నెన్నో!!
వ్యాసాల్లోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు, ఎంచుకున్న అంశాలు స్త్రీ పురుష ఆధిక్యతలకు అతీతంగా, అందరూ కలిసి ఆలోచించగలిగేలా ప్రయోజనాత్మకంగా పాఠక మనోరంజకంగా సాగాయి. ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు కుటుంబంలో అందరూ కలిసి నిలబెట్టుకోవడంలోని సరదా, ఆధునికతను ఆహ్వానించాల్సిన తీరు హాయిగా చెప్తాయి వ్యాసకథలు.
లతా మంగేష్కర్ ఐశ్వర్యారాయ్‌కి ప్లేబ్యాక్ పాడినట్లు టీనేజ్ కలం బలంతో కాలాతీత కాలమిస్ట్లుగా నిలబడి, తమ హాస్య చమత్కారాల చలువ పందిరిలోకి మనందర్నీ స్వాగతిస్తున్న నా ప్రియమైన ఫ్రెండ్స్ 'టీ' 'గాన' లచ్మీ పెసూన (టి. జ్ఞాన లక్ష్మీ ప్రసూన)లకు నా అభినందన అరవిందాలు.
- డా. కె.బి. లక్ష్మి
