• Mata Grahanam Veedindi
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మత గ్రహణం వీడింది

    Mata Grahanam Veedindi

    Publisher: Navodaya Book House

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అయాన్ హిర్సీ అలీ రాసిన ఇన్‌ఫిడెల్ ఆమె జీవిత చరిత్రే. ఆమె తన అనుభవాలనూ, జ్ఞాపకాలనూ, ఎంతో చక్కగా నిబద్ధతతో అక్షరబద్ధం చేశారు. సోమాలియాలో పుట్టి, సౌదీ అరేబియా, ఇథియోపియా, కెన్యాలో పెరిగారు. 22వ ఏట స్వేచ్ఛను కాంక్షిస్తూ శరణార్థిగా నెదర్లాండ్స్ చేరుకున్నారు. అక్కడ చదువుకున్నారు. ఉద్యోగం చేశారు. డచ్ పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. అంతటి ఎదుగుదల స్వేచ్ఛా సమాజాలలోనే వీలవుతుందన్న సత్యాన్ని ఆమె రుజువు చేశారు.

అయాన్ హిర్సీ అలీ ముస్లింగా ఎదిగారు. మతపరమైన కట్టుబాట్లన్నీ పాటించారు. చిన్నప్పుడే 'సున్తీ’ కూడా జరిగింది. ఆమె ఎదిగిన సమాజాలలో స్త్రీలు అణచివేతకు గురవటం, ఎలాంటి హక్కులు లేకుండా, అణగి మణిగి, బానిస జీవితాలు గడపటం చూచారు. తన జీవితంలో కూడా కొన్ని కష్టాలు చూచినా, స్వేచ్ఛా సమాజంలో అడుగిడి, చదివి, పనిచేసి మంచి జీవితాన్ని గడపగలిగారు. ఆ విధంగా తన జీవితంలో మంచే ఎక్కువ జరిగింది. గనుక తనను తాను అదృష్టవంతురాలననుకుంటున్నారు.

పార్లమెంటు సభ్యురాలుగా, స్వేచ్ఛాలోచనాపరురాలుగా ముస్లిం స్త్రీల స్థితిని మెరుగుపరచాలని కృషిచేస్తున్నారు. తన ఉపన్యాసాల ద్వారా రచనల ద్వారా, టి.వి., ఫిల్మ్ మాధ్యమాల ద్వారా ఆ పని చేస్తున్నారు. మతవాదులకు స్త్రీలకు చూపే స్వేచ్ఛా మార్గం నచ్చలేదు. ఆమెను చంపుతామంటూ బెదిరించి వెంటాడుతున్నారు. డచ్ ప్రభుత్వం ఆమెకు రక్షణ కలిగించింది. ప్రస్తుతం యు.ఎస్.లో నివాసం.

అయాన్ హిర్సీ అలీ స్వేచ్ఛా ప్రియత్వం, ముస్లిం స్త్రీలను విద్య, వివేకం, వికాసం వైపు పయనింప చేయాలనే ఆమె పట్టుదల, కృషి నాకు నచ్చింది. కోరగానే షరతులు విధించకుండా ఈ పుస్తకం అనువాదానికి నాకు అనుమతి యిచ్చారు. మత గ్రహణం వీడింది అనే పేరుతో స్వేచ్ఛానువాదం చేశాను. ఆమెకు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. ఈ పుస్తకం చదివిన వారికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.

- వెనిగళ్ళ కోమల

Preview download free pdf of this Telugu book is available at Mata Grahanam Veedindi