-
-
మాస్టర్ యోగచరిత్ర
Master Yogacharitra
Author: Sri Sarvari
Publisher: Master Yogaashram
Pages: 144Language: Telugu
అన్ని విధాల కొత్త పుంతలు తొక్కిన యోగం 'మాస్టర్ యోగం'. దేవతల పరంపరతో అనుబంధాలు, మంత్ర తంత్రాలతో బంధాలు పొసగని యోగం మాస్టర్ యోగం. కర్మలు, పాపపుణ్యాల నీడ సోకని సాధనా మార్గం మాస్టర్ యోగం. అందుకే నేటికీ లక్షలాది సాధకులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ విలక్షణ యోగానికి మూలం మాస్టర్ శక్తి ప్రసరణ. యోగావిష్కరణ చేసిన బాధ్యత మాస్టర్ సి.వి.వి.దే.
11 సంవత్సరాల, 11 నెలల, 11 రోజుల యోగ సాధనా ఫలితం మాస్టర్ యోగావిష్కరణ. ప్రేయర్స్, కోర్సెస్, రెగ్యులేషన్స్ ఈ యోగం అంతఃసూత్రాలు,సాధనా మార్గాలు. సాధనలో అనుభవంలోకి వచ్చే శక్తిప్రసరణ, యోగస్థితులు వీటి ఫలితాలే. ఈ ప్రేయర్స్,కోర్సెస్ ఆంగ్ల భాషలో ఉన్నట్లనిపిస్తాయి. నిజానికి ప్రపంచ భాషల సమాహారం ఇవి. ఇవన్నీ శబ్ద ప్రధానమైనవి. అర్థానికి అందని, అనుభవానికి మాత్రమే అందే నాద సౌదర్యం వాటి స్వంతం. శని,రవి,చంద్ర, కుజ,గురు ... ఇలా గ్రహాల ప్రభావం నుంచి తప్పుకోవడానికి ప్లానెటరీ కోర్సెస్,రెగ్యులేషన్స్ ఉపకరిస్తాయి. శారీరక రుగ్మతలకు దూరం కావడానికి,మనలో
'రెక్టిఫికేషన్'కి మాస్టర్ ప్రేయర్స్ సాధనాలవుతాయి. అయితే ఈ యోగక్రియకి ఒక గురువు లేదా సీనియర్ సాధకుడి ఇనీసియేషన్ (దీక్ష) అవసరం. మాస్టర్ యోగానుభవాలు రుచి చూడాలంటే కనీసం పదేళ్ల నిరంతర సాధన అవసరం. 35 ఏళ్లు సాధన చేస్తే తప్ప యోగసాధన పరిపూర్ణ దశకు చేరుకోదు. జనన మరణాలకి అతీతమైన పూర్ణస్థితి ... అమృతత్వ సిద్ధి అప్పుడే లభిస్తుంది.
- డా. వాసిలి వసంతకుమార్
