-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
మార్క్స్ - థీసీజ్ ఆన్ ఫొయర్బాక్ (free)
Marx Theses On Feuerbach - free
Author: Rao Krishna Rao
Publisher: Dr. Chelikaani Rama Rao Memorial Committee
Pages: 181Language: Telugu
ఫ్యూయెర్బాక్పై తన అవగాహనను మార్క్స్ పదకొండు పాయింట్లుగా రాసి పెట్టుకొన్నాడు. తర్వాత విపులీకరించే ఉద్దేశంతో కావచ్చు. ఇది 1845లో, అప్పటికి మార్క్స్ వయసు ఇరవై ఏడేళ్లు. ఆ పదకొండు అంశాలూ పదకొండు సిద్ధాంత సూత్రీకరణలు. ఫ్యూయెర్బాక్ అంటే మార్క్సుకి ఎంతో అభిమానముంది. అయితే ఫ్యూయెర్బాక్ భౌతికవాదానికున్న పరిమితుల్ని అర్థం చేసుకోడంలో మార్క్సుకి ఆ అభిమానం అడ్డుపడలేదు. ఫ్యూయెర్బాక్ నైరూప్య మానవుని స్థానంలో మార్క్సు నిజమైన మనిషినీ, యాంత్రిక భౌతికవాదం స్థానంలో గతితార్కిక భౌతికవాదాన్నీ నెలకొల్పాడు. ఆయన తాత్వికతలో ప్రకృతి, మనిషి, మానవ ఆలోచనలు, మొత్తంగా మానవ సమాజం, దాని చరిత్ర నిశ్చల నిశ్చితాలు కావు; అవి చలనశీలం; పరిణామ శీలం. ఈ తాత్విక ధోరణిని గ్రహించడానికి ఈ పదకొండు సూత్రీకరణలూ సాయపడతాయి. ఇంగ్లీషులో అవి Theses On Feuerbach.
రావు కృష్ణారావుగారు అధ్యయనశీలి. మార్క్సిస్టు. ఆయన గొప్ప కృషి చేసి ఈ 11 Thesis లను ఈ పుస్తకంలో విపులీకరించారు.
- రావు కృష్ణా రావు
