-
-
మార్క్స్ రాసిన 'కాపిటల్' పుస్తకం ఏం చెప్పింది?
Marx Rasina Capital Pustakam Em Cheppindi
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 212Language: Telugu
Description
'కాపిటల్’ లో మార్క్స్, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్నీ, దాని పంపిణీ విధానాన్నీ పరిశీలించే పనిచేస్తాడు. ఆ పరిశీలనా క్రమంలోనే, ఐరోపా దేశాల బానిస, భూస్వామ్య ఉత్పత్తి విధానాల్ని కూడా క్లుప్తంగా వివరిస్తాడు. అంతే గాక, ఈ 3 రకాల సమాజాలకూ పూర్తిగా భిన్నమైన ఒక ‘నూతన సమాజాన్ని’ కూడా ఎక్కడి కక్కడ సూచిస్తూ వుంటాడు.
మార్క్స్, తన పరిశీలనలో ‘శ్రమ దోపిడీ' అనే ‘వికృత క్రిమి'ని కొత్తగా కనిపెట్టగలిగాడు. దీనితో, 'కలిమి లేముల రహస్యం' అంతా బయటపడింది. సమస్త సమాజ రుగ్మతల మూలం అంతా తేటతెల్లమైంది.
మార్క్స్, 'శ్రమ దోపిడీ'ని గ్రహించి, అంతటితో వూరుకోలేదు. దాన్ని నిర్మూలించగల మార్గం కూడా వివరించాడు. మార్క్స్ ఇచ్చిన సిద్ధాంతమే ‘మార్క్సిజం’. ఇది, ఉత్పత్తి సంబంధాల మీద ఆధారపడిన భౌతికవాద శాస్త్రీయ సోషలిజం!
Preview download free pdf of this Telugu book is available at Marx Rasina Capital Pustakam Em Cheppindi
Login to add a comment
Subscribe to latest comments
