-
-
మార్తి వారి శ్రీ ప్లవ నామ సంవత్సర ఆర్షభారతీ గంటల పంచాంగము 2021 - 2022
Marthi Vari Sri Plava Nama Samvatsara Drugganita Arshabharati Gantala Panchangamu 2021 2022
Publisher: Self Published on Kinige
Pages: 258Language: Telugu, English
ఈ పంచాంగము యందు కాలమానము విజయవాడ 16°31°N 80°37E ప్రాంతమునకు సరిచూపబడినవి. శ్రౌత స్మార్త కర్మానుష్ఠానమునకు యోగ్యంబుగా సరిపోయే తిథి, నక్షత్ర, యోగ, కరణాదులు గంటలలో ఇవ్వబడినవి. ఇందు దుర్ముహూర్తం, వర్యం, అమృత ఘడియలు, లగ్నాంతకాలాలు, శుభ ముహూర్తములు ఇత్యాదివన్నియునూ కూడా గంటలలో ఇవ్వటమైనది. అన్నింటికీ అంత్యకాలాలు ఇవ్వడమైనది. గ్రహ సంచారం ప్రత్యక్ష దృగ్గోచరమునకు, ఆధునిక ఖగోళశాస్త్ర పరిశోధనకు సరిపోవు విధానంగా నిరయణ గ్రహ స్పటములు ఇవ్వటం జరిగినది. సనాతన జ్యోతిషశాస్త్రం అనుసరించి కొన్నిచోట్ల సాయనం, కొన్నిచోట్ల నిరయణం సమన్వయం చేసి ఇవ్వబడినవి. ఇందు సూర్యోదయం, సూర్యాస్తమయము సనాతన ధర్మసమ్మతముగా భానుడి మధ్యోదయ ప్రమాణముకు ఇవ్వటమైనది. ఇందు సాయన గణితం ఆధునిక దృక్కి సరిపోవును. ఇందు నిరయణమునకు సౌరాదిశాస్త్రము ద్వారా కాకుండా ఆధునిక పరికరాల ద్వారా పరిశోధించి ప్రత్యక్ష నిరూపణకు సరిపడుగా ట్రూ లాహిరి చైత్రపక్ష అయనాంశతో సరిపడుగా ఇచ్చినవి. ఈ ఆధునిక ధృక్ సాధనకు పూర్తిగా స్విస్ ఎఫిమెరీస్ ఫైల్స్ వాడి వాటి ద్వారా గణితము చేయటమైనది. సులభత్వము కొరకు కంప్యూటరు ద్వారా చేయటమైనది. సశాస్త్రీయంగా సూర్యసిద్ధాంతము నుండి భారతీయ వైదిక శాస్త్రీయ బీజ సంస్కారాల ద్వారా ఆధునిక ధృక్ సాధించు విధానము కనుగొనిన యెడల, స్విస్ ఎఫిమెరీస్ మాని ఆ విధంగానే భవిష్యత్తులో పంచాంగం చేయటం జరుగును. ఈ పంచాంగంలో ఇచ్చినవి అన్నీ పునః పరిశీలన చేసి సరిచేయటమైనది.
- శ్రీ మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ

- FREE
- FREE
- FREE
- ₹68.00