-
-
మరో మహా సంగ్రామం
Maro Maha Sangramam
Author: Patti Sumathi
Publisher: Praja Paksha Patrika Vividha Bharati
Pages: 48Language: Telugu
శ్రీమతి సుమతి ఒక యధార్థ సంఘటనని ఇతివృత్తంగా, కథావస్తువుగా ఎంచుకుని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలోని భార్యాభర్తల నడుమ దైనందిన జీవితంలో జరిగే సంఘర్షణలను చొప్పించి, దానిని ఓ అత్యద్భుత కావ్యంగా జీవం ఉట్టిపడేటట్లు మలచిన తీరు రచయిత్రి పరిమితి ఏమిటో మనం అవగతం చేసుకోవచ్చు. కవి హృదయం ఊహాజనితమే కాదు, ప్రకృతి వర్ణనకే పరిమితం కాదు. సమాజంలో అనునిత్యం జరిగే అరాచకాలను, అత్యాచారాలను, అకృత్యాలను, అన్యాయాలను, అసమానతలను, పైశాచిక చర్యలను, మగాధిక్యతను కళ్ళకు కట్టినత్లు ఓ పుస్తకం రూపమ్లో పొందుపరచటం అత్యంత అభినందనీయం.
నిర్భయ తన తుది శ్వాసవరకూ పోరాడిన తీరు, పోరాటపటిమ ప్రతీ హృదయాన్ని కలచివేసింది. కళ్ళ నీల్ళు పెట్టని జనావళి లేదు. నిర్భయ నిజంగా వీరనారి. నిర్భయ ఉదంతం వలన యావత్తు భారత యువతి నిర్భయంగా జీవించటానికి స్త్రీ శక్తి ఏమిటో తెలపకనే తెలిపింది రచయిత్రి.
ఇటువంటి సంఘటనలు మరల మరల మన భారతగడ్డపై పునరావృతం కాకుండా వుండడానికి రచయిత్రి సుమతి పరిష్కార దిశగా ఈ ఇతివృత్తానికి రూపాన్నిచ్చి జీవాన్ని నింపింది. ఈ సంఘటనకు ఓ శాశ్వత పరిష్కారం చట్టం రూపంలో రావటం ప్రప్రథమము. రచయిత్రి సుమతి ప్రయత్న ప్రతిరూపమే ఈ ఉదంత సారం.
- నండూరి రామకృష్ణ
